Views:
20

నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లిన ‘బాహుబలి’

అత్యంత బరువైన జీఎస్ఎల్‌వీ-మార్క్‌3 డి1 ప్రయోగం
– రోదసీలోకి జీశాట్‌-19 ఉపగ్రహాన్ని పంపిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) “బాహుబలి” గా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 640 టన్నుల జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌3 డి1 వాహక నౌక ప్రయోగం జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల సతీష్‌ ధావన అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్‌) నుంచి సోమవారం సాయంత్రం 5:28 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. దీనిద్వారా 3,136 కిలోల భారీ ఉపగ్రహం జీశాట్‌-19ని రోదసీలోకి ప్రవేశపెట్టారు. ,136 కిలోల బరువైన జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెడతారు.

ప్రయోగమిలా.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1  పొడవు 43.43 మీటర్లు.  బరువు  640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్‌–200)ను మండించటంతో రాకెట్‌ ప్రయాణం ప్రారంభమవుతుంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్‌–110) మండించి రాకెట్‌ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్‌–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తవుతుంది.

జీశాట్‌–19తో ఉపయోగాలివీ..
జీశాట్‌–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్‌ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్‌ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది.  ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది.  ఉపగ్రహంలో  కేయూ బాండ్‌ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్‌ స్పెక్ట్రోమీటర్‌ పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్‌ బరువు 1,394 కిలోలు.   జీశాట్‌–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది.

సౌజన్యం – ఈనాడు, సాక్షి

-రమణి

6 thoughts on “భళీరా.. భళిరా బాహుబలి”

  1. సమాచారం అంతా బాగుంది కానీ ఒక కల్పితమైన చలనచిత్రం తో ఇంత గొప్ప ప్రయోగాన్ని పోల్చడం మాత్రం దాని విలువను తగ్గింటడమే అవుతుంది. హ్హ! అన్నిటా సినీ మానియా..

    • పేపర్లు, మీడియా అలా ఘోషిస్తుంటే …. అలా పెట్టక తప్పలేదు…. మామూలుగా ఇస్రో అంతే అలా చూసి వెళ్ళేవాళ్ళు బాహుబలి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చే మీడియా మాయ… అదే సినిమా మానియా… నేను అలా ఉపయోగించా

    • మనలో మన మాట కల్పితమే ఈరోజు 1000కోట్లు పైగా కలెక్ట్ చేసింది నిజాలకి ఇంత విలువ ఇస్తుందా ప్రపంచం? భ్రమల్లో ఉన్న గ్రాఫిక్స్ అంటే ఇష్టపడుతుంది నిజంగా విజయం సాధించి నింగికెగసిన ఇస్రో ప్రయోగాన్ని హర్షించి భారత జెండాకి వందనం అనేవాళ్ళు ఎవరు…. భళిరా బాహుబలి అంటే పరుగున వచ్చి “ఓహ్ ఇస్రో నా” అని ఈసురోమని వెళ్తారు… నిజం ఎప్పుడు చెదే కల్పితం ఎప్పుడు ఆనందమే… జీవితం ఇది…. ఇస్రో ప్రయోగంలా నింగికి ఎగరాలనుకుంటుంది….. ఆ కలని కల్పిత సినిమాల్లో చూసి ఆనందపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *