Views:
63

“గోవధ నిషేధంపై పూర్వ కేసులు, వాదోపవాదాల వివరాలు” -అని మామాటలో ప్రచురించిన వ్యాసం పై (ఆ వ్యాసం మాదికాదు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదాన్ని యథాతదంగా ఇచ్చామని పాఠకులు గమనించాలి) ప్రతికూల విమర్శలే (పోర్టల్ లోను ఫేస్ బుక్ లోనూ)ఎక్కువగా వచ్చాయి. 

అందులో ఒక విమర్శ ఆలోచనీయము, ఆధార పూర్వకము అయినది ఉంది. దాన్ని మీరూ పరిశీలించండి..

“ఈ సందేశంలో సత్యాసత్యాలను పరిశీలించే ప్రచురించారా? లేకపోతే మీ వ్యాసాల ప్రామాణికతకు నష్టం వాటిల్ల వచ్చు. ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఆన్ లైన్ లో ఉంది. అది చదివాక ఈ సందేశం చదువుతుంటే ఇందులో అనేక అసత్యాలు గుప్పించినట్టు అర్ధం అవుతుంది. దయచేసి మీరు మరో సారి పరిశీలన చేసుకోండి.. అసత్యాలను ప్రచారం చేయకండి. “ అని మామాట లో రెహమాన్ గారు స్పందిస్తూ ఒక లింకును కూడా జతపరచారు.

రహమాన్ గారూ! వాట్సాఫ్, ఫేస్ బుక్ తదితర మాద్యమాలలో ఇది విరివిగా ప్రచారం అయినది. అది నిజమని భావించి ‘మామాట’ ప్రచురించలేదు. దీనిపై చర్చ జరగి వాస్తవావాస్తవాలు బయటకు రావాలనే ప్రచురించాము. మతమౌఢ్యంతో జరిగే ఏ చర్యకైనా ‘మామాట’ వ్యతిరేకం. మీ స్పందన చాలా బాగుంది. నెనరులు..

విషయం రహసకందాయంలో పడింది. పాకం పక్వానికొచ్చింది. మీరూ రుచిచూడండి..

లింకును అందరూ తప్పకుండా చూడండి, చదవండి- https://indiankanoon.org/doc/101278772/

 

8 thoughts on “ఈ ప్రశ్నకు బదులివ్వండి?”

  1. అడ్డెడ్డడ్డెడ్డేఁ ఈ గోవు కడి చిన్నదేం కాదు!!

  2. “గోవధ నిషేధంపై పూర్వ కేసులు, వాదోపవాదాల వివరాలు”, “ఈ ప్రశ్నకు బదులివ్వండి” లింకు, రెండూ చదివితే నిస్పాక్షిక నిజాలు బయటపడతాయి.

  3. వీధుల్లో వాల్ పోస్టర్లు తిని బ్రతుకుతన్న ఆవులను పట్టించుకోరు కానీ, గోవధ మీద గంగవెర్రులెత్తి పోతున్నారు.

  4. నా కామెంట్స్ ను ప్రచురించినందుకు ధన్యవాదాలు ఎడ్మిన్ గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *