Views:
6

 

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్‌ చేసిన సవాల్‌ను స్వీకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘నన్ను గుండు కొట్టిచ్చి హైదరాబాద్ లో తిప్పుతానంటున్నావ్. నీ సవాల్ ను స్వీకరిస్తున్నా. నన్ను ముట్టుకునే దమ్ముందా? బాల్క సుమన్ ఓ బచ్చా. నీపై ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నావు. తెలంగాణ పేరుతో నువ్వు చేసిన హత్యలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తేల్చుతాం. ఓయూలో కేసీఆర్‑తో సభ పెట్టించే దమ్ము బాల్క సుమన్‑కు ఉందా? అదే ఓయూలో మేం సభ పెడతాం. హైదరాబాద్‑లో నిన్ను తిరగకుండా చేయగలను.’ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులే సంగారెడ్డికి రావడానికి జంకుతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

సౌజన్యం: సాక్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *