Views:
15

మరదలు వెన్నెల: ఏంటి వదినా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

వదిన జాబిలీ : ఎమిలేదు వెన్నెల రేపటినుండి బ్యాంకు లు శని ఆదివారాలు పని చేయవట కదా… ఉన్నప్పుడు మటుకు ఈ నోట్ల రద్దు నుండి ఏమాత్రం ఆదుకున్నాయా అని.

మరదలు వెన్నెల : అవునోదినా నిజమే బ్యాంకు లు ఉదయం 9 గంటలనుండి, సాయంత్రం 5.30 ని. వరకూ పనిచేస్తాయట,  రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా  బ్యాంకు పనివేళల మార్పులకి, వారాంతపు సెలవలకి అనుమతి ఇచ్చిందని, జూన్ 1 నుండి ఇది అమలులోకి వస్తుందని ఈనాడు పేపర్ లో చదివాను వదినా..

వదినా: అవునట, బ్యాంకు ఉద్యోగం అంటే ఇస్త్రీ నలగని దుస్తులు, హాయిగా కూర్చుని చేసుకునే ఉద్యోగం అని సామాన్య ప్రజానీకం అభిప్రాయం. అది మరింత బలపరుస్తూ ఇప్పుడు వీరి పని వేళలు, వారాంతపు సెలవలు పెంచారు.  ప్రజానీకం  ఈ మార్పులని గమనించి శుక్రవారానికి వారి ఆర్ధిక లావాదేవీలని పూర్తీ చేసుకుంటే సెలవుల భారం పడదని విజ్ఞులు సూచిస్తున్నారు వెన్నెలా…

మరదలు : అందరికీ తెలిసిన విషయమే కదా వదినా మనమెందుకు చెప్పడం ?

వదిన: అందరికీ తెలిసినా మా మాట గా మన మాట గా మళ్ళీ కొంచం విశ్లేషిస్తూ, వివరిస్తూ వినూత్నంగా చెప్పాలని, అందరూ చెప్పే వార్తలే కదా అనుకుంటే ఇన్ని వార్తా పత్రికలు ఉండేవా? ఇన్ని చానల్స్ ఉండేవా.. ఎవరి ప్రత్యేకత వారిది. అన్నీ అందరికీ తెలుస్తాయి ఎవరు బావిలో కప్పలు కారు, అందుకని ఇలా అందరికీ తెలిసిన విషయాలే మరలా మన పద్ధతిలో చెప్పడం మా మాట ప్రత్యేకం అన్నమాట.

మరదలు : అవును వదినా మంచి మాట చెప్పావు. బ్యాంకు పనీవేళల విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే అయినా నా వంతుగా అందరికీ తెలియజేస్తాను…. ఇంకేమన్నా మంచి వార్తలు ఉన్నాయా వదినా?

వదిన : ఈరోజు అందరూ దాసరి స్మరణలో ఉన్నారు వెన్నెలా. మంచి మనిషి.. అలాగే దాసరి ఇల్లు.. అన్నపూర్ణ నిలయం అట , భోజనం సమయానికి ఆయన ఇంటికి ఎవరొచ్చినా సరే.. అన్నం తినకుండా వెళ్లడానికి వీల్లేదు. అలా రోజూ దాదాపు 40-50 మంది ఆయన ఇంట్లో చేయికడిగేవారు. ఉదయం, సాయంత్రాల్లో ఆయన్ను కలిస్తే అల్పాహారం తప్పనిసరి. దాసరిని కలిసేందుకు ఏ టైములో వెళ్లినా ఈ ఆత్మీయ ఆతిథ్యం ఉంటుంది.

మరదలు: ఎంత గొప్ప మనిషి కదా వదినా.. అంతే కాదు సినీపరిశ్రమలో పేద కళాకారులు చాలా మందికి ఆయన నెలకు ఇంతని డబ్బు పంపేవారు. సినీ పరిశ్రమకు చెందినవారికే కాదు.. పేద విద్యార్థులు ఎంతమందికి ఆయన ఫీజులు కట్టి అండగా నిలిచారో ఆ సాయం పొందినవారికి మాత్రమే తెలుసు. చిన్నప్పుడు తన తండ్రి స్కూలు ఫీజు కట్టలేక తనను పనిలో పెట్టినప్పుడు.. బడిలో తన స్నేహితులంతా కలిసి చందాలు వేసుకుని చదివించేవారని ఆయన ఎప్పుడూ గుర్తుచేసుకునేవారట. సాయం చేయాలంటూ తన వద్దకు వచ్చేవారిని ఎప్పుడూ ఉత్తచేతులతో పంపిన దాఖలాలు లేవట. అలా ఏటా దాదాపు 50 నుంచి 100 మంది విద్యార్థులకు ఆయనే పూర్తిగా ఫీజులు కట్టి చదివించేవారట వదినా.

వదిన : ఆయనకీ మన మామాట తరుపున హృదయ పూర్వక శ్రద్ధాంజలి అర్పిద్దాం వెన్నెలా.. ఇలా మనం ప్రతిరోజూ అందరికి తెలిసిన విషయాలయినా చర్చించుకుందాం, మళ్ళీ తెలియజేద్దాం… మా మాటగా .. మన మాటగా

మరదలు: వదినా మరో విషయం మరిచా… ఒక్క నిముషం ఆమధ్య నిర్భయ రేప్ కేసులో ఉరిశిక్ష తప్పించుకుని  బాల నేరస్థుడి జాబితాలోకి వెళ్ళిన చివరి ముద్దాయి మహమ్మద్ అఫ్రోజ్ ఈరోజు విడుదల అయ్యాడట … వీడు బాల నేరస్తుడు అయ్యాడు కాని వదినా మరీ కిరాతకుడు కదా దారుణంగా అత్యాచారం జరిపిన తరువాత క్రూరంగా ఐరోన్ రాడ్ లోపలికి పంపి పైశాచికత్వాన్ని చూపించాడు.. సౌత్ ఇండియా కి బతకడానికి వస్తున్నాడట… జైలు నుండి మహిళలు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వదినా ఇది..

 

వదిన : అవునా .. వీడిని బతకనివ్వడమే నేరం… పైగా ఇప్పుడు సౌత్ ఇండియా కా… ఎక్కడెక్కడ తిరుగుతాడో అక్కడంతా చిన్నపిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలి ,  మంచి విషయం … జాగ్రత్త పడమని చెప్పడం మన వంతు.

రచన : రమణి రాచపూడి

One thought on “అందరికీ తెలిసిందే ! అయినా “మామాట” గా… 31/05/2017”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *