Views:
16

చలపతిరావు గారి  నోటి దురుసు సంఘటనల తరువాత మీడియా ఉలిక్కిపడి  తమ కార్యక్రమముల వైపో కన్నేసింది. ఈ మధ్య కాలంలో నవ్వుల కార్యక్రమంలో నవ్వుల స్కిట్స్ శృతి మించడం అందరికీ తెలిసినదే. మగవాళ్ళకి ఆడవాళ్ళ వేషం వేసి వారిచేతే చెప్పుకోడానికి కూడా నోరు తిరగని దంద్వ అర్థాలతో జనాలని నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ యూత్ చూస్తున్నారు కాబట్టి మేము అలా నటిస్తున్నాము అని ఎవరికీ వారె సమర్ధించుకుంటూ నవ్విస్తున్నామన్న భ్రమలో ఉన్నారు. నవ్వడం ఒక భోగం , నవ్వకపోవడం రోగం అన్నారు కాని ప్రతి వెకిలి , వ్యంగ్య హాస్యాలకి నవ్వమని ఎవరు చెప్పలేదు. ఈ నవ్వుల స్కిట్స్ ద్వారా  మహిళలని కించపరచడం, కాలెత్తి కొట్టడం,  అసభ్య పదజాలం, (నాకు కారిపోతోంది, కరెంట్ లేదు) తో స్కిట్స్, వాటికి అటు యాంకర్స్, ఇటు జడ్జేస్ పడీ పడీ నవ్వడం, కుటుంబంతో కలిసి కూర్చుని చూడగలిగే కార్యక్రమాలేనా ఇవి? సున్నితమయిన హాస్యం అంటే అర్థం తెలియని ప్రతి ఒక్కరు స్కిట్స్ చేసేవాళ్ళే… ఈ తరహ అవహేళన భరించలేక మహిళా సంఘాలు కొరడా ఝుళిపించాయి. రెండు రోజుల క్రితం చలపతి రావు కామెంట్ కి వత్తాసు పలికిన యాంకర్ రవికి ఉద్వాసన చెప్పారు మల్లెమాల ప్రొడక్షన్స్, ఇప్పుడు శ్రీముఖి కూడా ఇలాంటి శృతి మించిన డైలాగ్స్ లో ముందుంటుంది , మహిళా సంఘాల ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రహించి శ్రీ ముఖిని కూడా మల్లెమాల ప్రొడక్షన్స్ పటాస్ ప్రోగ్రాం నుండి తొలగించారట. ఇది మహిళా సంఘాల మరో విజయం.

 

 

సౌజన్యం : తెలుగు పవర్

లింక్ http://telugupower.com/te/2017/05/29/srimukhi-2/

విశ్లేషణ : రమణి రాచపూడి

ఉపసంహారం : శ్రీముఖి సరే మరి జబర్దస్త్ యాంకర్ల మాటేమిటి? ఆడవేషాలేసి వెకిలిగా మాట్లాడే వాళ్ళ మాటేమిటి? ఎదో వెనకాల ట్రైన్ వెంటబడుతున్నట్లు యాంకర్ల సగం సగం బట్టల విషయం ఏంటి? వీటిపై ఏమి యాక్షన్  తీసుకోరా అని విమర్శకులు నొసలు చిట్లిస్తున్నారు.  మాములుగా కనిపించేవి కప్పేసి, కనిపించాకూడనివి వదిలేసి స్నానం చేసి అలా వచ్చేసినట్లుగా ఉన్న ఆ గుడ్డముక్కల విషయం ఆలోచిస్తే మంచిది అని అభిమానుల అభిప్రాయం.

4 thoughts on “శ్రీముఖి సరే! జబర్దస్త్ మాటేమిటి మరి?”

  1. ఇది మహిళల విజయం, మహిళల పవర్. ఒక్కో ఒక్కో పావు కదులుతోంది.. జబర్దస్త్ కూడా ఒక గాటిన పెడితే కుటుంబసభ్యులతో చూడగలిగే మంచి నవ్వుల కార్యక్రమం అవుతుంది. కాస్త ఆ వెకిలి హాస్యం ఆపండి బాబు… ముందు ఆ మగవాళ్ళకి ఆడవేషాలని వేసి హాస్యాన్ని అపహాస్యం చేయద్దు.

  2. రవి, శ్రీముఖిల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న ఆ ఛానల్ వారిని అభినందించాలి. “రారండోయ్ …. …” ఆడియో ఫంక్షన్లో ఆడయాంకర్ ఈవిడేనా? ఏమైనప్పటికీ ఈ పరిణామాలు ఏంకర్లందరికీ తగిన హెచ్చరికగా పనిచేస్తాయనీ, వాళ్ళు ఇకనుంచైనా అదుపులో వ్యవహరిస్తారనీ ఆశిద్దాం.

  3. నిన్న, ఈ రోజు కూడా టీవీ ఛానెల్స్ తిప్పుతుంటే “ఈటీవీ ప్లస్” ఛానెల్ లో “పటాస్” ప్రోగ్రాంలో ఈ ఏంకర్ రవి మళ్ళా కనిపించాడే ! ప్రోగ్రామ్ నిర్మాతల నిర్ణయం మారిందా? !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *