Views:
6

కలిసొచ్చే కాలానికి నడిఛి వచ్చే కొడుకు పుడతాడని ఒక సామెత. బ్రహ్మం గారు మరుగుజ్జులాంటి మనుషులు పుడతారుఅని,  బిడ్డలు లేని గొడ్డురాలికే  బహుమతులన్నరీనాడు అని చెప్తూ రాను రాను పిల్లలు కూడా మితంగా కంటారు అంటూ కాలజ్ఞానం చెప్పారు. బ్రహ్మం గారు చెప్పిన ప్రతి కాలజ్ఞానం ఇప్పుడు మనకి జరుగుతున్నదే.

తు చ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానం ఇది . మరి ఇలాంటి సమయంలో జరిగిన వింతట …

కలిసొచ్చే కాలానికి నడిఛి వచ్చే కొడుకు అన్న సామెత ఉంది కాని, మరి బ్రహ్మం గారు ఈవిషయం చెప్పేరా అంటే ఏమో అనాలి.. బ్రహ్మం గారు చెప్పినా చెప్పకపోయినా ఇదొక వింతగా, ఎక్కడా జరగని అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఢిల్లీ లో డాక్టర్లు ఢిల్లీ లో బేబీ ఇలా పుట్టగా అలా డాక్టర్ చేతిని ఆసరా చేసుకుని పురిటి మంచం మీద అడుగులు వేయడం ఒక అద్భుతం. కలికాలంలో కనీ వినీ ఎరగలేదు అని విమర్శకులు కూడా ఆశ్చర్యపోతున్నారుట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

సౌజన్యం : ఆంధ్రజ్యోతి

లింక్ : http://www.andhrajyothy.com/artical?SID=419678

విశ్లేషణ : రమణి రాచపూడి

ఉపసంహారం : మరి కలిసి వచ్చే  కాలానికి నడిఛి వచ్చే  కొడుకు పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ అదృష్టం ఆ తల్లి తండ్రులదా మన దేశానిదా వేచి చూడాల్సిందే.

2 thoughts on “కలిసొచ్చే కాలానికి …”

  1. ఉందిలే మంచి కాలం నంద నందనా.. అన్నట్లు.. ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి అంటే దేశానికి మంచి రోజులు వచ్చినట్లే అని అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *