Views:
4

అప్పిచ్చు వాడు వైద్యుడు అన్నారు పెద్దలు.. ఆపదలో వచ్చి ఆదుకుని ప్రాణాపాయం నుండి వైద్యుడు ఎలా రక్షిస్తాడో , అప్పిచి గండాల నుండి రక్షిస్తారు ఈ అప్పు ఇచ్చు వాళ్ళు. ఇప్పుడు ఆంద్ర ప్రదేశ్ అమరావతికి అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చింది ప్రపంచ బ్యాంకు. కేంద్రంతో ఓ పక్క హోదా, ప్యాకేజ్ లాలూచి పడుతూనే.. ప్రపంచ బ్యాంకు నుండి అప్పు కొడం పడిగాపులు కాసింది అమరావతి. ఎట్టకేలకు అప్పిస్తాం రమ్మంది పరపంచ బ్యాంకు.  అడిగింది , ఒప్పుకున్నది 100 కోట్ల డాలర్లు… తొలివిడతగా 50 కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్లుగా బ్యాంకు తెలిపింది.

అమరావతిని అంబరాన నిలపడానికి ఎంత ఖర్చయినా పర్వాలేదు అని అప్ప్పుకు కూడా వెనకాడకుండా తల తాకట్టు పెట్టి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టినట్లుగా అప్పు పుట్టించిన నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి కృషిని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారుట.

సౌజన్యం వికాస్ లైవ్

లింక్ : http://vikaslive.com/andhra-pradesh-news/amaravathi-bank-loan/

విశ్లేషణ : రమణి రాచపూడి

ఉపసంహారం : మనలో మన మాట అప్పు ఇవ్వాలంటే తాయిలం చూపించాలి మరి అటు బంగారమో లేదా ఇంకేదన్నా విలువయిన స్తిరాస్తులో… మరి ఇన్ని కోట్ల డాలర్ల అప్పుకి మన ప్రభుత్వం ఏ తాయిలం చూపించి ఉండొచ్చు ప్రత్యెక హోదా…. లేదా ప్యాకేజా? ఆంధ్ర లో ఐటీ నా?  అని విశ్లేషకుల సందేహలట .. కాలమే తీర్చాలి ఈ సందేహాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *