Views:
5

అక్కినేని వారింట అడుగుపెట్టబోతున్న సమంతా తన బికినీ ఫొటోను షేర్ చేసింది. కంగారు పడకండి.. బికినీ ఫొటో అంటే బికినీ వేసుకుని దిగిన ఫొటో కాదు. కేవలం బికినీ ఫొటో మాత్రమే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. సమంతా ఎందుకిలా చేసిందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, సమంతా చర్యపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంతా కూడా వారికి గట్టిగానే జవాబు చెబుతోంది.

సెలబ్రిటీలు, అది కూడా హీరోయిన్లు ఏం చేసినా చాలా సంచలనమే అవుతుంది. వివిధ మీడియా సంస్థలు, చిన్నా చితకా వెబ్ సైట్లు ఇటువంటి న్యూస్ ను ప్రచురించడానికి ఉవ్విళ్ళూరుతాయి. బికినీ వేసుకోవడం సామాన్యమైన విషయమే. కానీ సినీతారలు వేసుకుంటే మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. కొన్ని విషయాలు వారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపుతాయి కూడా. ఇటువంటి విషయాలలో మీడియా, సోషల్ మీడియా సంస్థలకు, వార్తలను నిత్యం అందుకునే ప్రజలకు కొంత ఆలోచన అవసరం.

వార్తా సేకరణ: యజ్ఞపాల్ రాజు ఉపేంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *