Views:
5

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా అన్న హితవు తెలుగులో ఉండటం వలననుకుంట, పాపం కర్ణాటక ముఖ్యమంత్రికి అర్థంకాలేదు. అందుకే జరుగుతున్నది మీడియా సమావేశమైనా ఏమాత్రం మొహమాటం లేకుండా సీఎం సిద్ధరామయ్య ఓ కునుకు లాగించేశారు.  ఆయన అలా నిద్రపోవడం  పలు చర్చలకు తావిచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ మూడేళ్ల పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు కె.సి.వేణుగోపాల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వేణుగోపాల్‌ పక్కనే కూర్చున్న సీఎం సిద్ధరామయ్య నిద్రపోతూ కనపడ్డారు.గతంలోనూ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ఇలానే కునుకు తీసి విమర్శల పాలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *