Views:
1

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడేళ్ల కాలంలో నిరుద్యోగుల సంఖ్య తగ్గాల్సింది పోయి కొంచెం పెరిగిందని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే 2013–2014 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కార్మిక శక్తితో 4.9 శాతం ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5 శాతానికి చేరుకుంది. నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, రోడ్లు, విద్యుత్‌ను అందరికి అందుబాటులోకి తీసుకొస్తామని, దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా తీర్చి దిద్దుతామని, టెర్రరిజాన్ని తుదముట్టిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా హామీ ఇచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు తెలియనప్పటికీ, ఉద్యోగ పురోగతి సవ్యంగా లేదని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ అధికారంలోకి రాకముందు, అంటే యూపీఏ అధికారంలోవున్న 2011 జూలై నుంచి 2013 డిసెంబర్‌ నాటికి, రెండేళ్ల కాలంలో 12 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్ల కాలంలో అందులో సగం ఉద్యోగాలనే కొత్తగా సష్టించగలిగింది.అయితే ఈ గణాంకాలు ఇలా ఉండగా ఇవి కేవలం పత్రిల లెక్కలు మాత్రమేనని దేశంలో నిరుద్యోగం ఏమాత్రం లేదని నిరుద్యోగంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను అమిత్ షా ఖండించారు.125కోట్ల మంది జనాభా గల భారత్‌లో అందరికీ ఉద్యోగవకాశాలు కల్పించడం కుదరదని ఆయన అన్నారు.ఈ కారణంతోనే స్వరోజ్ గార్(స్వయం-ఉపాధి)ని ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు.దేశంలో నిరుద్యోగం ఎక్కడా లేదని, కేవలం మీడియా రిపోర్టులోనే ఉందని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *