Views:
4

మహిళా ఎమ్మెల్యేలను, చట్ట సభలను కించపరిచారనే ఆరోపణలపై పొలిటికల్ పంచ్ ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఇష్టారీతిన కామెంట్లు పెట్టే మరికొందరు వైసిపి అభిమానుల అరెస్టుకు రంగం సిద్ధమయిందనే ప్రచారం సాగుతోంది. అనుచిత కామెంట్లు పెడితే ఊరుకోవద్దని టిడిపి భావిస్తోందట.
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై బాబు ఆగ్రహం
సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‍‌తో పాటు అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అనుచిత పోస్టులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు.
ఇప్పటికే ఇద్దరి అరెస్ట్
ఇప్పటికే ఇంటూరి రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలు అరెస్టయ్యారు. ఆ జాబితాలో మరికొందరు వైసిపి అభిమానులు ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు టిడిపి అభిమానులు కొన్ని పేజీల్లో గ్రూపుల్లో ఓ వార్తను షేర్ చేస్తున్నారని అంటున్నారు.
వైసిపి అభిమానుల లిస్ట్
రవికిరణ్, రవీంద్ర ఇప్పాలలతో పాటు ఇష్టారీతిన పోస్టులు పెడితే మరికొందరి అరెస్టు కూడా తప్పదని అందులో పేర్కొంటున్నారని అంటున్నారు. తమ వద్ద వైసిపి అభిమానుల లిస్ట్ ఉందని, తప్పుడుగా పెడితే మాత్రం ఊరుకునేది లేదని చెబుతున్నారంటున్నారు.
ఆ జాబితా ఇదేనంటూ…
ఇంటూరి రవికిరణ్, రవీంద్రలు అరెస్టయ్యారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి చల్లా, తిరుమల ప్రసాద్ పాటిల్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుడ్ల శివకుమార్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ మేడిశెట్టి, యశ్వంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *