Views:
9

ఈ ఉత్తరాల ప్రక్రియ ఈరోజుది కాదు. జవహర్ లాల్ నెహ్రూ తానూ జైల్లో ఉన్నప్పుడు తనకూతురికి ఉత్తరాల ద్వారా స్ఫూర్తిని ఇచ్చాడని మనం చదువుకున్నాము. అలాగే మన తరం వాళ్ళల్లో బందువులు దూరప్రాంతాలనుండి వచ్చినప్పుడు వెళ్ళగానే “క్షేమంగా చేరానని, ఉత్తరం రాయమని చెప్తూ పంపించేవాళ్ళం” ఇప్పటి తరానికి ఉత్తరం అంటే అర్థం తెలీదు లెటర్ అంటే బిజినెస్ లెటర్స్ అనుకుంటారు తప్పితే ఇలా బంధువుల మధ్య కార్డు సైజు, ఉత్తరాలు బ్లూ కలర్ ఇన్లాండ్ లెటర్ల సందడి తెలీదు. ఆ రకంగా ఒకవిధంగా చెప్పాలంటే వాళ్ళు చక్కటి సాహిత్యనుబంధాన్ని కోల్పోయారనే చెప్పాలి. మా యింట్లో నేను మా అక్కకి రాసినవి, అప్పుడప్పుడు మా కజిన్స్ కి రాసిన ఉత్తరాలు ఉన్నాయి ఎప్పుడయినా పాపని చదవమని ఇస్తాను. “ఉభయకుశలోపరి” అని చదవగానే పక్కన పెట్టేస్తుందిి ఈ లెటర్ తెలుగులో లేదమ్మా అని, ఇది నేటి తెలుగు పాండిత్యం పిల్లలిది. వాళ్లకి రాకపోవడం గొప్ప, మనకి బాధ. సరే ఇప్పుడ అది కాదుఅసలు విషయం. 

మనం మన పిల్లలికి ఏమి ఇవ్వగలం,ఆస్థిపాస్థులు ఇవన్నీ కామన్. ఇప్పుడు వున్న టెక్నాలజీ కి పిల్లల జీవితాలు ఉరుకుల పరుగుల మయం కనీసం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే సమయం ఉండనంత బిజీ లైఫ్ వాళ్ళగాఘాధలని కూర్చోబెట్టుకుని చెప్పేవారు. వారి అనుభవాలని వడబోసి, ఆటుపోట్ల జీవితాలని కథల రూపేణా మనకి చెప్పేవారు. మన ఆటలన్నీ స్వచ్చమయినా స్వేచ్చావాయువుల మధ్య సాగింది. అందమయిన బాల్యం మనది… ఇప్పుడు అసలు బాల్యం ఏది? చదువులు, ఉద్యోగాలు అంతే. అందుకేనేమో అమితాబ్ ఉత్తరం నన్ను బాగా టచ్ చేసింది. పిల్లలు వారి జీవితాన్ని వారు స్వతంత్రంగా జీవించడానికి మనం తోడ్పడాలి. వాళ్ళతో వీలయినంత వరకూ మాట్లాడగలగాలి. వాళ్లకి/మనకి సమయం లేకపోయినా సరే వీలు చూసుకోగాలగాలి.జీవితం వారిదే కాని దాన్ని అందంగా మరల్చుకోడంలో మన సహాయం వాళ్లకి వాళ్ళు వేసుకునే డ్రెస్ వారిని ఎక్కడ నిలబెడుతుంది అన్నది వారికే తెలియాలి. అంతే కాని వాడెవడో పిక్కల దగ్గర చింపేసుకున్నాడు ఫ్యాషన్ అంటూ మొదలెడితే తల్లి తండ్రి చెప్పగలగాలి… సొంత వ్యక్తిత్వాన్ని అలవరచుకునే జ్ఞానాన్ని సొంతంగాఆలోచించగలిగేట్లు వారికి వారి ముందు తరాలవాళ్ళం మనమే అందజేయాలి.

అందుకే నేను మా పిల్లలికి (వాళ్ళు చదివినా చదవకపోయినా) నాకు వీలయినంత వరకు ఉత్తరాలు రాద్దామనుకుంటున్నా.. వాళ్ళకి మా అమ్మ ఇలా ఉండేది అన్న ఆలోచన కోసం, మనముందు తరాల అనుబంధం, వారి ప్రేమ, వారి జీవిన విధానం, అన్నీ.. వాళ్లకి వాళ్ళ పిల్లల్లికి ఉపయోగ పడేలా.. నా ఉద్యోగ జీవితంలో నేనేుదుర్కొన్న కష్టాలు నా ఆలోచనలు, నాఅనుభవాలు అన్నీ ఒక్కో ఉత్తరంలో… ఎలా ఉంది మిత్రాస్ నా ఐడియా?

పిల్లలికి మంచి వ్యక్తిత్వం అలవర్చాలి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *