Views:
5

గుట్కా తింటే పక్షవాతం వస్తుందా?  అవుననే అంటున్నారు వైద్యులు.  గత ఏడాది లలితా హాస్పిటల్‌లో చికిత్స పొందిన 200మంది పక్షవాత రోగులపై డాక్టర్‌ విజయ నేతృత్వంలో వైద్యబృందం అధ్యయనం జరిపింది. ఆరు నెలలపాటు ఈ అధ్యయనం జరిపారు. ప్రధానంగా నమిలే పొగాకు (పాన్ మసాల, గుట్కా) వాడకానికి, పక్షవాతం దాడికి మధ్య సంబంధం ఉందా? అనే అంశంపై దృష్టిసారించి అధ్యయనం చేశారు. పరిశోదన అనంతరం ఫలితాలను విశ్లేషించారు. ఇందులో 55మంది రోగులు (27.5 శాతం) గుట్కా, పాన్మసా మహాఇష్టంగా తింటున్నారు. మరో 53మంది రోగులకు (26.5 శాతం) పొగ పీల్చనిదే తెల్లారడం లేదు. ఇక 28మంది రోగులు (14శాతం) తమకున్న హైబీపీని లెక్కచేయకుండా గుట్కా ప్యాకెట్లను నమిలి పారేస్తున్నారు. మరో 25మంది హైబీపీ రోగులు (12.5 శాతం) గుప్పుగుప్పున పొగ పీలుస్తున్నారు. 55 మంది అధిక ర క్తపోటు రోగులు (27.5 శాతం) ఇతర వ్యవసనాలు లేకపోయినా వ్యాధిని అదుపులో ఉంచుకోలేక పక్షవాతం బారినపడ్డారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులతో పోలీస్తే సిగరెట్‌, గుట్కా అలవాటు ఉన్న బీపీ రోగులకు పక్షవాతం సోకే ప్రమాదం ఆరు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. వచ్చే నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే వరల్డ్‌ సో్ట్రక్‌ కాంగ్రెస్‌ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్‌ విజయ గుంటూరులో తాను జరిపిన ఈ అధ్యయన అంశాలపై పేపర్‌ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

గుట్కా,పొగాకు, పాన్‌మసాలా దాసులు మరి కొంచం భద్రం.ఆరోగ్యం ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *