Views:
4

ఇటాలియన్ పిజ్జా అమెరికన్ బర్గర్

చైనీస్ నూడుల్స్ కెంటెకీ ఫ్రైడ్ చికెన్ ల

సంగతొదిలెయ్

ఈ మధ్యెప్పుడైనా..

మీ సొంతూళ్ళో మా శెట్టి గారి కిరాణా కొట్టులాటి దాంట్లో

మరమరాలుండో వేరుశెనగపప్పచ్చో కొని తిన్నావా ?

వేళ్ళకంటుకున్న పాకం ఆప్యాయంగా జుర్రుకున్నావా ?

అని అడిగే రోజులు పోయాయి.

లక్షలు ఖర్చు పెట్టి బర్గర్ తింటే మన హోదా పెరిగినట్లన్నమాట. ఏంటి లక్షలా అని ఆశ్చర్యపోతున్నారా. వినాయక చవితికి మన లడ్డులకి వేలం పాటలా దుబాయ్ లో బర్గర్లకి వేలంపాట..  అయితే వీరు ఇలా వచ్చిన డబ్బును ఆరోగ్య అవగాహనకి కాబట్టి ఒక మంచి పనికోసం తలపట్టే కార్యక్రమం నిర్వఘ్నంగా సాగాలని మనసార కోరుకుందాం.

ఇక విషయంలోకి వస్తే దుబాయ్ లో బర్గర్ ఏకంగా 10 వేల డాలర్లు పలికింది. అంటే మన భారత కరెన్సీలో 6.5 లక్షలన్నమాట. జ్యూసీ బర్గర్ కోసం నిర్వహించిన చారిటీ ఆక్షన్‌లో దుబాయ్ లైఫ్ స్టైల్ మ్యాగజీన్ విల్లా వ్యవస్థాపకుడు అస్మా అల్ ఫహిమ్ 10 వేల డాలర్లకు దీన్ని సొంతం చేసుకున్నారు. రెండేళ్ళ క్రితం నిర్వహించిన వేలంలో ఈ బర్గర్ 7వేల డాలర్లకు అమ్ముడుపోయింది.  ఈ ఏడాది ఈ  బర్గర్ తన రికార్డ్ తానె అధిగమించింది. దుబాయ్ పింక్  క్యారవాన్ ఈ వేలాన్ని నిర్వహిస్తోంది.  ఈ వేలం ద్వారా సేకరించిన నగదును బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కల్పించడానికి వాడుతుంటారు.  ఈ బర్గర్‌తో పాటు మరికొన్ని డిషెస్ కూడా వేలానికి వచ్చాయి.  మొత్తంగా 29,633 డాలర్లను ఈ సంస్థ సేకరించింది. మాములుగా అయితే ఇన్ని లక్షలా అని నోరు వెళ్ళబెట్టినా ఒక నోబుల్ పని కోసం కాబట్టి ఈ లక్షలని లక్షణంగా తీసుకోవచ్చని విమర్శుకులు కూడా మెచ్చుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *