Views:
1

 

ఏపీలో అత్యంత సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన యూనివ‌ర్సిటీ ఆంధ్రా యూనివ‌ర్సిటీని టీడీపీ ఎమ్మెల్సీ దెయ్యాలకొంపగా అభివర్ణించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గీతం విద్యా సంస్థల యజమాని అయిన మూర్తి వ్యాఖ్యలను విద్యామంత్రి గంటా శ్రీనివాస‌రావు తప్పుబట్టారు. మూర్తి వ్యాఖ్యలు విద్యార్థుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. నిర‌స‌న‌లకు దారితీశాయి. ఏయూలో టీడీపీ మ‌హానాడు నిర్వ‌హించ‌డాన్ని ప‌లువురు వ్య‌తిరేకించారు. గ‌తంలో రాజ‌కీయ కార‌ణాల‌తో ప‌లువురికి అనుమ‌తి నిరాకరించిన గ్రౌండ్ లో ఇప్పుడు అధికార పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఎలా అనుమ‌తిస్తార‌ని ప్ర‌శ్నించారు. దీనిపై స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి ఏయూను ఓ దెయ్యాల కొంప‌గా అభివ‌ర్ణించారు. వాటికి అద్దె చెల్లించి వాడుకుంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. దాంతో విద్యార్థులు క్యాంప‌స్ లో ఆందోళ‌న‌ల‌కు దిగారు. ఏయూని కించ‌పరిచినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Visakhapatnam (Andhra Pradesh)25-09-2011: MVVS Murthy the president of GITAM University in Visakhapatnam
—photo:C.V.Subrahmanyam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *