Views:
2

భానుడి భగభగలు.. వేడి సెగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్య కిరణాల రూపంలో నిప్పుల వాన కురుస్తుండటంతో ఇబ్బందులు పడున్నారు. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాయువ్య ఉష్ణగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం నల్గొండలో 46.2 ఉష్ణోగ్రత నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *