Views:
3

అత్యధిక లాభాలను ఆశపెట్టి, జనం నుంచి పెట్టుబడులను రాబట్టుకొని, వారి పుట్టి ముంచే ఆర్థిక సంస్థల స్థిరాస్తులను జప్తు చేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడు (ఆర్థిక సంస్థల్లో) డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ చట్టం,1997ను సమర్థించింది. జనాన్ని ఆర్థికంగా మోసగించేవారిని కట్టడి చేయడానికి ఉద్దేశించిన చట్టంగా దీనిని అభివర్ణించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అపీలుపై జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ పీసీ పంత్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అమాయక పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చట్టాన్ని తమిళనాడు ఆమోదించిందని పేర్కొంది.

గ్లోబల్ కేపిటల్ ట్రేడింగ్ సర్వీసెస్ అనే ఆర్థిక సంస్థ భాగస్వాముల స్థిరాస్తులను జప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు 2012 డిసెంబరు 24న రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డిపాజిట్ల కాల పరిమితి ముగిసిన తర్వాత తిరిగి చెల్లించడంలో కానీ, డిపాజిట్లపై వడ్డీని సకాలంలో చెల్లించడంలో కానీ, డిపాజిట్‌ను ఏ లక్ష్యంతో చేశారో దానిని నెరవేర్చడంలో కానీ విఫలమైన ఆర్థిక సంస్థకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నట్లు తీర్పు చెప్పింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *