Views:
6

 

గురూ, శుక్రవారాల్లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఇప్పుడు వివాదాలకు కారణమవుతుంది. అందుకు కారణం మితిమీరిన ద్వందార్ధాలుతో కూడిన కామెడీ అనేది తెలిసిన విషయమే. దీనివల్ల గృహినులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఈ కార్యక్రమంలో ప్రసారమవుతున్న అంశాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియయాలో కూడా అభ్యంతరాలు చెబుతున్నారు. దీనిపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యం గానీ , మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ గానీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవడం అటుంచితే బూతు డోసు మరింత పెంచేసి విచ్చలవిడిగా ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ ఒక్కటే కాకుండా ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ కార్యక్రమం కూడా బూతు సంభాషణలు కలిగి ఉంటుంది. పిల్లలు పక్కనుంటే  ఈ సంభాషణలు వినడం మరింత ఇబ్బందిగా మారింది.

ఇప్పటివరకూ ఒకటి రెండు ఫిర్యాదులు అందినా ఈ కార్యక్రమాలపై ఎలాంటి సెన్సార్ చేయలేదని కొందరు వాపోతున్నారు. ప్రసారమవుతున్న ఈ బూతు వ్యవహారాలపై మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమం లో దారుణమైన పదజాలంతో అనైతికంగా డైలాగులు ఉంటున్నాయని పిర్యాదులో పేర్కొన్నారు. వీటిపై తక్షణమే సెన్సార్ నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందిస్తూ ఏది  మితిమీరిన రుచించదనే విషయాన్ని  దృష్టిలో పెట్టుకుని ప్రసారాలు కొనసాగిస్తే ఆరోగ్యకరమైన వినోదం  అందరికీ అందుతుందనే తెలియజేస్తూ యాజమాన్యాలు దీనిని  గుర్తుంచుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *