Views:
2

బాహుబలికే మూడేళ్లు పట్టింది… మరిక  అమరావతి అంతకంటే అద్భుతం  కదా ఇంకొంచం సమయం పడుతుంది.
అద్భుతమైన బాహుబలి సినిమాను నిర్మించేందుకు మూడేళ్ల సమయం తీసుకుందని, అంతకంటే మహాద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంకా సమయం తీసుకుంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. అమరావతి: అద్భుతమైన బాహుబలి సినిమాను నిర్మించేందుకు మూడేళ్ల సమయం తీసుకుందని, అంతకంటే మహాద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంకా సమయం
తీసుకుంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.


విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించమని భగవంతుడు తనను ఆదేశించాడని చెప్పారు. రాజధాని బాధ్యతను ఆయన తనకు అప్పగించాడని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఉంటుందని చెప్పారు.
బాహుబలి సినిమా తీయాలంటేనే మూడేళ్లు పట్టిందని, మరి రాజధాని నిర్మాణానికి మరింత సమయం తీసుకోదా అని అభిప్రాయపడ్డారు. విమర్శలు సరికాదని, చేతనైతే అభివృద్ధికి సహకరించాలన్నారు. రాజధానికి విపక్షాలు అడ్డుపడటం వల్ల ఏడాదిని కోల్పోయామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *