Views:
1

తండ్రి మృత‌దేహాన్ని త‌న ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ కోసం అడుగ‌గా అక్క‌డి ప్ర‌భ‌త్వాస్ప‌త్రి అధికారులు అందుకు నిరాక‌రించ‌డంతో … ఓ సైకిల్ కార్ట్‌పై  తండ్రిని తీసుకెళ్లిన ఘ‌ట‌న జ‌లంధ‌ర్‌లో చోటుచేసుకుంది. ప్ర‌భుత్వం ఎన్నిక‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టినా అధికారుల అల‌స‌త్వం ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది.
స‌ర‌బ్జీత్ తండ్రి మునేష్ కోల్ అనారోగ్యంతో గ‌త ఆదివారం ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను అడిగాడు. అందుకు అధికారులు లేద‌ని చెప్ప‌డంతో ప్రైవేట్ అంబులెన్స్ అడిగాడు. అంబులెన్స్ కావాలంటే రూ.400 అడిగాడు ఓన‌ర్‌. అయితే స‌రబ్జీత్ ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో రూ.150కి ఒక ఆటోను మాట్లాడుకుని కొంత దూరం వ‌ర‌కు ఆటోలో మృత‌దేహాన్ని తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత త‌న బంధువుల ద‌గ్గ‌ర ఒక సైకిల్ కార్ట్ తీసుకుని తండ్రి మృత‌దేహాన్ని ఇంటికి చేర్చాడు.
ఈ విష‌య‌మై ప్ర‌భుత్వ అధికారులను వివ‌ర‌ణ కోరగా… పేషంట్స్‌ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చేందుకు మాత్ర‌మే అంబులెన్స్ ఇస్తామ‌ని..చ‌నిపోయిన వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిబంధ‌న‌లు  అనుమ‌తించ‌వ‌ని చెప్పారు. ఇదే విష‌యం ప్ర‌భుత్వానికి తెలిపిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వాస్ప‌త్రిలో అధికారులు క‌నీస మాన‌వత్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సామాజిక వేత్త‌లు విమ‌ర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *