Views:
2

అనంతపురం: అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం కలుగోడులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఐదుగురు రైతులు మృతి చెందారు. వర్షం పడుతుండగా చెట్టుకింద ఉన్న గుడిసెలో తలదాచుకునేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపడి ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఓబన్న, శివన్న, కరీముల్లా, జయన్న, గిరిరెడ్డిగా గుర్తించారు. రాయదుర్గం మండలం కదరంపల్లిలో పిడుగుపాటుతో రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. పిడుగుపాటుకు గురైన గ్రామానికి జిల్లా మంత్రి కాలువ శ్రీనివాసులు బయలుదేరారు. అధికారులను అప్రమత్తం చేసి తక్షణ సాయం చేయాలని, క్షతగాత్రులను వైద్య అందించాలని మంత్రి ఆదేశించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *