Views:
3

ఐదేళ్లుగా ఒక యువ‌తితో డేటింగ్ చేసి మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు ఓ ప్ర‌బుద్ధుడు. విజ‌య‌వాడ‌కు చెందిన భ‌ర‌త్ శ్రీనివాస్ అనే యువ‌కుడికి వ‌రంగ‌ల్ జిల్లా మ‌ట్టేవాడ‌కు చెందిన ఓ యువ‌తితో ఆదివారం పెళ్లి కావాల్సి ఉంది. స‌రిగ్గా ముహూర్తం స‌మ‌యానికి మ‌రో యువ‌తి పెళ్లి మంట‌పంలో ప్ర‌త్య‌క్ష‌మై త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి వివ‌రించింది. భ‌ర‌త్ త‌న‌తో ఐదేళ్ల‌పాటు స‌హ‌జీవ‌నం చేశాడ‌ని ఇప్పుడు మ‌రో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడ‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. విష‌యం తెలుసుకున్న పెళ్లికూతురు బంధువులు భ‌ర‌త్‌కు దేహ‌శుధ్ది చేసి ద‌గ్గ‌ర‌లోని పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు.
పెళ్లికి ముందు భ‌ర‌త్ నిజ‌స్వ‌రూపం తెలియ‌డం త‌న కూతురు చేసుకున్న అదృష్టం అన్నారు పెళ్లికుమార్తె త‌ల్లిదండ్రులు. ఒక్క క్ష‌ణం ఆల‌స్య‌మైనా త‌న కూతురి జీవితం అంధ‌కారంలోకి ప‌డిపోయేద‌న్నారు. పెళ్లికి ముందే శ్రీనివాస్‌కు రూ.15లక్షల కట్నంతో పాటు సామాన్లు అప్పగించామని ఇప్పుడు అవ‌న్నీ త‌మకు తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు త‌ల్లిదండ్రులు.శ్రీనివాస్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *