Views:
2
రోజురోజుకు దేశంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి.అయినా మన న్యాయస్థానాలు వారికి కఠినమైన శిక్షలు వేయడంలో విఫలం అవుతూనే ఉన్నాయి.
Swati Maliwal 
ఇదే విషయమై తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ అద్యక్షురాలు స్వాతి మలివాల్ స్పందించారు.
                             రేపిస్టులకు మరణశిక్ష విధించాలని, కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆపగలమని ఆమె అన్నారు. గురుగ్రామ్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన యువతిపై కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఆమె దేశంలో ప్రతి నిమిషానికి ఓ రేప్ జరుగుతుండడం తీవ్ర ఆందోళన కల్గిస్తోందని అన్నారు.
ప్రతి రేపిస్టుకు మరణశిక్ష విధించడం ద్వారా భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపాల్సిన అవసరం ఉందని అన్నారు.అత్యాచారాలకు అడ్డుకట్టపడాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలన్నారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయడమే సముచితమని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *