Views:
5

పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం పాఠశాలల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ విక్రయాలపై మహారాష్ట్ర సర్కారు నిషేధం విధించింది. జంక్ ఫుడ్ తో పాటు 30 శాతం చక్కెర ఉన్న పానీయాల వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోందని హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలింది. కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారపదార్థాలను పాఠశాలలో క్యాంటీన్లలో విక్రయించరాదని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరగడంతోపాటు దంతసమస్యలు, మధుమేహం, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని మహారాష్ట్ర పాఠశాల విద్య కార్యదర్శి నందన్ కుమార్ చెప్పారు. జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *