Views:
3

కన్నూరు: రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) సందర్భంగా కేరళలోని కన్నూరులో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు టీచర్లపై వేటు పడింది. పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చిన 17 ఏళ్ల విద్యార్థినిని డ్రెస్‌కోడ్ పేరిటీ టీచర్లు ఇబ్బంది పెట్టారు. ధరించిన బ్రాను తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో మరో మార్గం లేక దానిని తొలగించి వచ్చి పరీక్ష రాయాల్సి వచ్చింది. టీచర్ల విపరీత ప్రవర్తనపై మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. చాలా సంఘాలు స్కూలు ఎదుట ఆందోళన నిర్వహించాయి. అసెంబ్లీలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. పలు పార్టీలు టీచర్ల తీరును తప్పుపట్టాయి. దీంతో స్పందించిన స్కూలు యాజమాన్యం నలుగురు మహిళా ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఇద్దరు సభ్యుల ప్యానెల్‌తో విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం జిల్లా పోలీస్ చీఫ్ నుంచి నివేదిక కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *