Views:
2

నటుడు, నృత్య‘దర్శకుడు రాఘవ లారెన్స్‌ తన తల్లి కన్మణికి కట్టించిన ఆలయాన్ని ఇవాళ ( మాతృదినోత్సవం రోజున మే 14) ప్రారంభించారు. దీంతో బతికుండగానే తల్లికి ఆలయం కట్టించిన తొలి నటుడిగా లారెన్స్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. స్థానిక అంబత్తూర్‌లో లారెన్స్‌ కొన్నేళ్ల క్రితం నిర్మించిన రాఘవేంద్ర ఆలయ ప్రాంగణంలో తల్లికీ గుడి కట్టించారు. ఆదివారం ఉదయం ఈ ఆలయాన్ని స్టంట్‌మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. కెరీర్‌ ప్రారంభంలో కష్టాలో ఉన్న లారెన్స్‌ని సుబ్బరాయన్‌ మాస్టర్‌ ఆదుకున్నారు. ఆ అభిమానంతోనే తన తల్లికి గుడిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీరలు, ఆరుగురు మహిళారైతులకు సహాయం అందజేశారు లారెన్స్. ఈ గుడి ప్రపంచంలోని అందరి అమ్మలకు అంకింతం చేస్తున్నట్లు తెలుపాడు. గుడి ప్రారంభోత్సవానికి వచ్చే ప్రతీ ఒక్కరూ తమ తల్లిని తోడు తీసుకు రావాలని కోరుతూ అడ్రస్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు లారెన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *