Views:
3

జామియా ఉలేమా – ఈ – హింద్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ సంచలన డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవుకు జాతీయ జంతువు హోదాను ఇవ్వాలని గట్టిగా కోరారు. గో రక్షకుల చర్యల వల్ల భయానక వాతావరణం ఏర్పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. జామియా ఉలేమా – ఈ – హింద్ దేశంలోని ఇస్లామిక్ స్కాలర్స్‌లో అత్యధికులకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

విలేకర్ల సమావేశంలో మదానీ మాట్లాడుతూ ప్రభుత్వం గోవుకు జాతీయ జంతువు హోదాను ఇవ్వాలన్నారు. అందుకు తాము మద్దతిస్తామన్నారు. గో రక్షకుల చర్యల వల్ల దేశంలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, దీంతో భయానక వాతావరణం నెలకొందని చెప్పారు. యువ గో రక్షకులు మతాన్ని హత్యలు, దోపిడీల కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. హిందువుల మతపరమైన మనోభావాలను తాము గౌరవిస్తామని తెలిపారు. అయితే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదన్నారు….బొజ్జా వెంకట బుచ్చి రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *