Views:
5

అమ్మ …. అమ్మ గురించి చెప్పే అవకాశం, అమ్మ గురించి అసలేమి చెప్పాలో తెలియని ఆలోచనల అంతరంగం నాది. ప్రతి రోజు అమ్మకే కదా ఈరోజు ఎందుకు అమ్మగురించి అంటారు కొందరు కొందరు కాదు అందరూ… పాశ్చ్యాత్య సంస్కృతీ ని మనమెందుకు అలవాటు చేసుకోవాలి అని ఇంకో కారణం చెప్తారు , నాకు ఈ అమెరికా వాళ్ళతో ప్రతిరోజూ  మాటా మంతీ ఉంటాయి… ఒకసారి మాటల సందర్భంలో ఒక 25 ఏళ్ల అబ్బాయి నాతో అన్నాడు “ఆంటీ నాకసలు ఈ మథర్స్ డే ఇష్టం లేదు ఆంటీ ఇక్కడ పెరిగి పెద్దయ్యాక తన తండ్రి వదిలేసిన తల్లి ఎవరో వెతుక్కుని కలుసుకునే రోజు అందుకే నేను అమ్మకి విలువిస్తాను కాని మమ్మీకి విలువ ఇవ్వను అని అన్నాడు .. అవును మనం ఇదే రోజుని మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో మాతృదేవోభవ అనుకుందాము. ఆనందంగా ఆరోజు అమ్మ దగ్గరికి వెళ్దాం. మనం కేవలం అమ్మకి ధన్యవాదాలు చెప్తే ఋణం తీరదు కాసేపు అమ్మదగ్గర కూర్చుని ఆ చిన్ననాటి తలపులు, ఆటలు గుర్తు చేసుకుందాం. అమ్మ ప్రేమలు, అమ్మ గుర్తులు, కేవలం రాతలకే పరిమితం అవకూడదు. ఆదే నా కోరిక… ప్రస్తుత తరం వాళ్ళు సెల్ ఫోన్లతో, చాటింగ్లతో , ఉద్యోగ వేటలో, భావిష్యట్లో నిలదోక్కుకోదానికో సాంకేతిక పరిజ్ఞాన మరచట్రం లో చెరుకుగాడలా నలిగిపోతూ ఉన్నారు అలాంటి వారికి జీవితాన్ని వడబోసి ఆటుపోట్లని ఎదుర్కొన్న ఆ తరం మనిషి కావాలి. ఒళ్లో పడుకోబెట్టుకుని జోల పాడినా, గోరుముద్దలు తినిపించినా… కష్టాలప్పుడు నేనున్నాను అని చెప్పదానికయినా అమ్మ కావాలి. అమ్మని చూస్తె చాలు మన కష్టాలు దూదిపింజల్లా అనిపిస్తాయి. ఆమె పడిన కష్టం ముందు మన కష్టం ఎంత అనిపిస్తుంది. నాన్న బాధ్యతగా నడవడికని నేర్పితే అమ్మ ప్రేమ బంధంతో జీవితాన్ని ప్రేమించడం ఎలాగో నేర్పుతుంది అందుకే అమ్మదగ్గరికి వెళ్ళాలి , అమ్మ దగ్గరికి ఒక భార్త/బార్య లాగో, ఒక తండ్రి/తల్లి లాగో, ఒక హోదా కలిగిన వ్యక్తిలా కాదు ఒక కొడుకు/కూతురిగా  వెళ్ళు ఏస్థాయి మనదయినా అమ్మ దగ్గర మనకి ఎప్పటినికి నిలిచిపోయేడి కొడుకు/కూతురి స్థానమే… ఆ స్థానం ఎవరు భర్తీ చేయనిది చేయలేనిది. మథర్స్ డే శుభాకాంక్షలు అని కాకుండా… ఒక్కసారి అమ్మ దగ్గరికి చిన్న పిల్లలమై “అమ్మా నీకు వందనం …. ఈ భూమి మీదకి నన్ను తీసుకు వచ్చి నాకొక హోదాని ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని తెలుపుదాం.  మన తెలుగులో , మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో… అమ్మకి పాదాభివందనం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *