Views:
6

 

శీర్షిక

సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!

పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం: “అన్నంత పనీ చేసిన ఆంధ్రా పోలీస్!”

************


ఈమారు పకడ్బందీ ఏర్పాట్లతో ఇంటూరి రవికిరణ్ ను ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నెల 21న ఇంటూరి రవికిరణ్ ను విచారణ పేరుతో తుళ్లూరుకు తీసుక వెళ్లిన పోలీసులు, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో అనేక హైడ్రామాల నడుమ 22న తిరిగి (24గంటల అనంతరం) అతనిని అతని ఇంటి వద్దే దిగబెట్టి వెళ్లారు. అప్పటినుండి విచారణ పేరుతో పలుమార్లు అతనిని స్టేషన్ కు పిలిపించి ఇంట్రాగ్రేట్ చేస్తూ వచ్చారు. ఈరోజు విశాఖపట్టణం 3వ టౌన్ పోలీసులు విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వైద్యపరీక్షల అనంతరం విశాఖజిల్లా ఫోర్త్ ఏడియం కోర్టులో హాజరు పరచినట్లు ప్రస్తుతానికి ఉన్న సమాచారం.

 

రవికిరణ్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు, మహిళల గౌరవానికి భంగం కల్పించాడని ఒక కేసు IPC 292, Sec 66, Sec 31 తదితర ఇతర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు అతని వైపు లాయర్లు అంటున్నారు, ఈ కేసులు నిలిచినా నిలువక పోయినా పాలకులు తమ అక్కసును తీర్చుకోవడానికి పోలీసులను వినియోగించుకుంటున్న తీరు స్పష్టంగా బయట పడుతోంది.

 

ఏ రకంగా, ఏ కేసులలో రవికిరణ్ ను ఖైదు చేసినా అది కేవలం “నిప్పు-తుప్పు”ల ప్రతీకారచర్యే అని నెటిజనులతోపాటు, బయట జనాలు బాహాటంగానే అంటున్నారు. పోలీసులైతే బాసుల, బాబు వత్తిళ్ల నుండి తప్పించుకోవడానికి అతనిపై నాలుగు కేసులు కట్టి ప్రస్తుతానికి చేతులు దులుపుకున్నారు.

 

ఉపసంహారం:- ‘కెలుకు కున్నవారికి కెలుకు కున్నంత’ అన్నట్లు ఎంత కెలికినా, కడిగినా గురివింద తన మచ్చను తొలగించుకోలేదు. ఇలాంటి యాగీలతో మరింత అగుడు పట్టడం తప్ప ఆశించిన ఫలితాలు లభించవు..

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

09.05,2017 – మంగళవారం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *