Views:
4

 

శీర్షిక

‘సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!’

నలుగుతున్న అంశం: “సత్సాంప్రదాయోభ్యుదయునికి ఫాల్కే కిరీటం”

***********************
2010లో బాలచందర్ తర్వాత దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని, భారత రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్న దక్షిణభారత చలనచిత్ర దర్శకుడు మన కాశీనాథుని విశ్వనాథునికి చలనచిత్ర ప్రియులు అందరి తరఫునా శుభాభినందనలు.

కాశీనాథుని విశ్వనాథ్ పురస్కారముల జాబితా-
*****************************************
పౌర పురస్కారం:-
1992 – పద్మశ్రీ పురస్కారం (భారత ప్రభుత్వం నుండి)

కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) పురస్కారం:-
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి

అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు:-
1981 – Prize of the Public at the Besancon Film Festival of
France for Sankarabharanam
2014 – Gulf Andhra Award for Life Time Achievement in cinema
at Dubai, U.A.E.

జాతీయ చలనచిత్ర పురస్కారాలు:-
1980 – జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం
1982 – నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం – సప్తపది
1984 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు సాగరసంగమం
1985 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు – స్వాతిముత్యం
1986 – స్వాతిముత్యం అధికారికంగా ఆస్కార్ అవార్డుకు ప్రతిపాదించబడింది.
1988 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు శృతిలయలు
2004 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు స్వరాభిషేకం
2017 – దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం (ఇప్పుడు ఎంపికయ్యాడు)

Filmfare పురస్కారాలు:-
1974: ఉత్తమ దర్శకుడు – ఓ సీత కథ
1975: ఉత్తమ దర్శకుడు – జీవనజ్యోతి
1982: ఉత్తమ దర్శకుడు – శుభలేఖ
1983: ఉత్తమ దర్శకుడు – సాగరసంగమం
1986: ఉత్తమ దర్శకుడు – స్వాతిముత్యం
1987: ఉత్తమ దర్శకుడు – శృతిలయలు
1989: ఉత్తమ కథ – ఈశ్వర్ (హిందీ)
1992: ఉత్తమ దర్శకుడు – ఆపద్బాంధవుడు
1994: ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం
1995: ఉత్తమ దర్శకుడు – శుభసంకల్పం

రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు:-
1981: ఉత్తమ స్క్రీన్-ప్లే రచయిత – సప్తపది
1986: ఉత్తమ దర్శకుడు – స్వాతిముత్యం
1987: ఉత్తమ దర్శకుడు – శృతిలయలు
1992: రఘుపతి వెంకయ్య జీవిత సాఫల్య పురస్కారం
1995: ఉత్తమ పాత్ర (క్యారెక్టర్ యాక్టర్) – శుభసంకల్పం
2000: ఉత్తమ సహాయ నటుడు – కలిసుందాం రా

దర్శకునిగానే కాకుండా చిత్ర కథా/స్క్రీన్-ప్లే రచయితగా, నటునిగానూ రాణించిన కళాతపస్వి, పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ ఫిబ్రవరి 19, 1930న జన్మించాడు. స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడినుంచి ఆయన నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్యాభ్యాసం గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.

 

సినీ ప్రస్థానం

చెన్నై లోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.

కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు:-

ఆత్మ గౌరవం
అల్లుడు పట్టిన భరతం
సిరి సిరి మువ్వ
సీతామాలక్ష్మి
శంకరాభరణం
సప్తపది
ఆపద్భాందవుడు
శృతిలయలు
స్వాతికిరణం
స్వాతిముత్యం
స్వర్ణకమలం
అమ్మ మనసు
శుభలేఖ
శుభోదయం
శుభ సంకల్పం
సిరివెన్నెల
సాగరసంగమం
స్వయంకృషి
జననీ జన్మభూమి
చిన్నబ్బాయి
సూత్రధారులు
స్వరాభిషేకం
జీవితజీవన జ్యోతి
ప్రేమబంధం
చెల్లెలి కాపురం
నిండు హృదయాలు
చిన్ననాటి స్నేహితులు
ఉండమ్మా బొట్టు పెడతా
కలిసొచ్చిన అదృష్టం
ప్రైవేటు మాస్టారు
శారద
కాలం మారింది
ఓ సీత కథ
శుభప్రదం నౌక
కాలాంతకులు

ఉపసంహారం:- వివాదాలకు అతీతంగా, విమర్శలను గౌరవిస్తూ, వృత్తిపట్ల నిబద్ధతతో, విజయాలకు పొంగిపోక, అపజయాలకు కృంగిపోక, ఎత్తుపల్లాలను అధిగమిస్తూ, మంచితనంతో ముందుకు సాగితే పురస్కరాలు వెంటబడుతాయి. అలాకాకుండా పదవులు, బిరుదులు మీద; పరుల ఆస్తిపాస్తుల మీద బుద్ధంతా నిలిపేవాడు చితి మీదకు పోకముందే జనాగ్రహానికి కాలి బూడిదైపోతాడు.

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *