వరంగల్ లో జర్నలిస్ట్ లకు 800 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Share Icons:
-వరంగల్ లో జర్నలిస్ట్ లకు 800 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు…కేటీఆర్ శంకుస్థాపన
-పాల్గొన్న అమర్, అల్లం నారాయణ ,మంత్రులు, ఎమ్మెల్యేలు
 -జిల్లాలో 2BHK ఇండ్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి
ఎంతో కాలంగా పెండింగులో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల సమస్యకు వరంగల్ లో ఒక పరిష్కారం లభించింది. ఇది రాష్ట్రంలోని వివిద జిల్లాలలో ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ లకు మార్గదర్శకాన్ని ఇచ్చినట్లైంది. వరంగల్ నగరంలోని దేశాయిపేట్ వద్ద జర్నలిస్టుల 2 bhk, 200 ఇండ్లు, దుపకుంట లో 600 2 BHK లకు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయటం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్ట్ లు ప్రభుత్వచర్యపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ముందడుగు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి కేటీఆర్ వివిద జిల్లాలో జర్నలిస్ట్ లకు ఇదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాయి.
– కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply