దారుణం: మైనర్ బాలికపై ఆరుగురు దుర్మార్గులు అత్యాచారం….

Share Icons:

ఒంగోలు, 24 జూన్:

తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఇటీవల తెలంగాణలోని వరంగల్‌లో 9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపేసిన ఘటన మరవకముందే….ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనర్ బాలికను ఆరుగురు కామాంధులు 3 రోజులు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసులో ప్రధాన నిందితుడు బాజీ దివ్యాంగుడు. అతను బస్ స్టేషన్ లోని దుకాణంలో పనిచేస్తున్నాడు. తాను ప్రేమించిన కారు డ్రైవర్ రామును కలవడానికి వచ్చిన గుంటూరుకు చెందిన 17 ఏళ్ల బాలికని ఒంగోలు బస్ స్టేషన్ లో నిరీక్షిస్తుండగా బాజీ ట్రాప్ చేశాడు. రాము తనకు తెలుసునని చెప్పి ఆమెను తీసుకుని వెళ్లాడు.

బాలికను ఆకాశ్ అనే మిత్రుడి గదికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆరుగురు బాలికపై నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో మైనర్లు ఉన్నట్లు డిఎస్పీ అంటున్నారు. నిందితుల్లో శ్రీకాంత్ అనే నిందితుడు కూడా ఉన్నాడు.

కాగా, రాము అనే కారు డ్రైవర్ రామును బాలిక ప్రేమించింది. అతన్ని కలవడానికి గుంటూరు నుంచి బాలిక ఒంగోలు వచ్చింది. ఒంగోలు బస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత రాముకు ఫోన్ చేసింది.. అయితే, ఎంతకీ కలవకపోవడంతో అక్కడే ఉండిపోయింది. దాన్ని గమనించిన బాజీ రాము తనకు తెలుసునని బాలికను తన వెంట తీసుకుని వెళ్లాడు. రాము కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఫోన్ పనిచేయడం లేదని పోలీసులు చెబుతున్నారు.

సామూహిక అత్యాచారం బాధిత బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని, కఠినంగా శిక్షించాలని అన్నారు. హోమ్ మినిష్టర్ సుచరిత కూడా.. నిందితుల వివరాలను, బాలిక పరిస్థితి తెలుసుకున్నారని.. మహిళలపై దాడులు సహించబోమని స్పష్టం చేశారు.

 

Leave a Reply