వేలానికి వచ్చిన చందమామలోని రాయి

Share Icons:

 అమెరికా, అక్టోబర్ 11,

ఏ రాయి అయితే ఏమి పళ్లూడగొట్టుకోవడానికి … అని సామెత కానీ , అది మామూలు రాయి కాదు. అందమైన మన మామ చందమామ పై నుంచు దిగివచ్చిన రాయి.

చందమామపైకి వెళ్లలేక పోయినా, ఆక్కడ నుంచి వచ్చిన రాయిని స్వంతంచేసుకునే అవకాశం వచ్చింది. సుమారు 12 పౌన్లు (5.5 కిలోలు) ఉన్న ఈ రాయిని గత ఏడాది వాయువ్య ఆఫ్రికాలో కనుగొన్నారు. దీనిని  బోస్టన్ కు చెందిన ఆర్ ఆర్ కంపెనీ వేలానికి పెట్టింది. బహుశా 5 లక్షల టాలర్లకు అమ్ముడవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. గురువారం నుంచి ఆన్ లైన్లో బిడ్డింగి మొదలైంది. ఈ నెల 18 వ తేదీ వరకు ఉంటుంది.

కొన్ని వేల సంవత్సారల క్రితం నేలపై పడిన ఈ రాతిని (meteorites)  సాంకేతికంగా NWA 11789 అని పేర్కొంటారు.  చంద్రుని పై నుంచి వ్యోమగాములు తెచ్చిన శిలాజాలు అమెరికా ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అందువలన, చంద్రుని భాగాలు స్వంతం చేసుకోవడానికి ఇదొకటే మంచి అవకాశమని ఆర్ ఆర్  సంస్థ ఉపాధ్యక్షుడు రాబర్ట్ వింగ్స్టన్ తెలిపారు.

మామాట: అందితే చందమామనే అమ్ముతారేమో  అమ్మో..

Leave a Reply