చిచ్చరపిడుగు! 11 ఏళ్లకే అద్భుత ప్రతిభ…

Share Icons:
  • ఈ భారత సంతతి చిన్నారి
  • ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల్లో ఒక అమ్మాయి
  • జాన్స్ హాప్కిన్స్ పరీక్షల్లో అసమాన ప్రతిభ
  • వర్సిటీ హై ఆనర్స్ అవార్డ్స్ కు ఎంపిక

ఆ అమ్మాయి వయసు 11 ఏళ్లు. పసిప్రాయంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో అదరగొట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి జాబితాలో తనకంటూ  చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవాళ్లలో ఆ చిన్నారి ఒకరని అమెరికాలోని అత్యున్నత యూనివర్సిటీ అయిన జాన్స్ హాప్కిన్స్  ప్రకటించింది.  అమ్మాయి పేరు నటాషా పెరి.

భారత సంతతికి చెందిన ఆ చిన్నారి.. న్యూజెర్సీలోని థెల్మా ఎల్ శాండ్మియర్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతోంది. జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ ట్యాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించే ట్యాలెంట్ సెర్చ్ లో నటాషా పాల్గొంది. సీటీవై నిర్వహించే ప్రతిష్ఠాత్మక స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (యాక్ట్)లో అదరగొట్టేసింది. అమెరికాలో కాలేజీల ప్రవేశాల కోసం ఈ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటారు.

ఈ పరీక్షలకు 84 దేశాలకు చెందిన 19 వేల మంది హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పరీక్షలకు ‘గ్రేడ్ 5 (ఐదో తరగతి)’ చదువుతున్న నటాషా కూడా హాజరైంది., అడ్వాన్స్ డ్ గ్రేడ్ 8కు నిర్వహించే పరీక్షలకు సరిసమానంగా ఆమె మార్కులు తెచ్చుకుంది. 90 శాతం పర్సంటైల్  సాధించింది.  ఆమెను సీటీవై ‘హై ఆనర్స్ అవార్డ్స్’కు ఎంపిక చేసింది. ఈ విజయంతో తాను మరింత స్ఫూర్తి పొందానని, భవిష్యత్ లో మరిన్ని సాధిస్తానని నటాషా చెప్పింది. గూగుల్ సెర్చ్, జేఆర్ఆర్ టోకీన్స్ నవలలు తనకు మేలు చేశాయంది.  అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి విద్యార్థులను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply