రెండు గ్లాసుల నీటికి టిప్పు… 10వేల డాలర్లు

Share Icons:
హైదరాబాద్, అక్టోబర్ 23,
మనం ఎక్కడైనా రెస్టారెంట్‌కు వెళ్తే సర్వ్ చేసిన వారికి తోచినంత టిప్ ఇస్తుంటాం. కొందరు 20, 50 లేక 100 రూపాయల టిప్ ఇస్తారు. ధనికులై మంచి మనసున్నవారైతే వేల రూపాయల టిప్ ఇచ్చేవారు అక్కడక్కడా తారసపడతారు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళా సర్వర్ ఏకంగా 7 లక్షల రూపాయల టిప్ అందుకుని లక్కీ గర్ల్‌గా ఫేమస్ అయిపోయింది.
ఉత్తర కరోలినా, గ్రీన్విల్లే సూప్ డాగ్స్ రెస్టారెంట్‌కు సెలబ్రిటీ, యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్స్) వెళ్లారు. రెండు అర్డర్లు చేయగా అలైనా కస్టర్ ఆయనకు సర్వ్ చేసింది. బిల్లు చెల్లించి వెళ్లిపోగా, అలైనా తనకు వచ్చిన టిప్ చూసి కంగుతింది. మిస్టర్ బీస్ట్ అలైనాకు 10వేల డాలర్లు (7.2 లక్షల రూపాయలు) టిప్ ఇచ్చారు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమోనని అలైన్ అనుకుంది. చివరికి అది తనకు వచ్చిన టిప్ అని తెలుసుకుని సంబరాలు చేసుకుంది.
తన జీవితంలో అందుకున్న భారీ టిప్ అని అలైనా చెప్పింది. చాలా సంతోషంగా ఉందని చెప్పిన అలైనా.. సర్వ్ చేసింది కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లు. మీరు చదివింది నిజమే. కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లు ఆర్డర్ చేసిన మిస్టర్ బీస్ట్ పదివేల డాలర్ల టిప్ ఇచ్చారు. స్వచ్ఛమైన నీటిని అందించినందుకు తాను మనస్ఫూర్తిగా టిప్ ఇచ్చినట్లు బీస్ట్ ఓ చిన్న కాగితంపై రాసి వెళ్లారని సర్వర్ అలైనా హర్షం వ్యక్తం చేసింది.
మామాట: ఆ అమ్మాయి ఆ రోజు నక్క తోక తొక్కివచ్చుంటుంది డ్యూటీకి..  

Leave a Reply