కేవలం 29 గంటల్లోపునే నిర్మితమైన 10 అంతస్తుల భవనం!

Share Icons:

సాధారణంగా ఓ చిన్న గుడిసె నిర్మాణానికే మనకు రోజుల సమయం పడుతుంది. అలాంటిది బహుళ అంతస్తుల నిర్మాణానికి  నెలలు, సంవత్సరాల సమయం పడుతుంది. చేతిలో డబ్బు, మెటిరీయల్‌ అంతా సిద్ధంగా ఉన్నప్పటికి నిర్మాణం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది చైనాలో 10 అంతస్తుల నిర్మాణాన్ని కేవలం 28 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. అయితే అదేదో సినిమా సెట్టింగ్ కాదు, కంప్యూటర్ ఇంద్రజాలము కాదు. మనుషులు నివసించే అపార్ట్‌మెంట్‌ను కేవలం 28 గంటల్లో నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచింది ఆ కంపెనీ.

చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్‌ గ్రూప్‌ కంపెనీ ఈ రికార్డును సృష్టించింది. ఈ పది అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం కోసం బ్రాడ్‌ కంపెనీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌(ముందుగా నిర్మించిన) కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 29 గంటల లోపునే 10 అంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. దీనిలో భాగంగా ఫ్యాక్టరీలో ముందుగానే నిర్మించిన చిన్న విభాగాలను సమీకరించడం ద్వారా నిర్మాణం పూర్తి చేస్తారు.

ఇక ఈ 10 అంతస్తుల భవనం నిర్మాణం కోసం ముందుగానే నిర్మించించిన కంటైనర్‌ సైజ్‌ బ్లాక్స్‌ను తీసుకువచ్చి… వాటన్నింటిని ఒకదాని మీద ఒకటి పేర్చి… బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత బోల్ట్స్‌ బిగించి… వాటర్‌, కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అంతే, ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి 28 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీరూ ఆ విడియోను వీక్షించండి-

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply