హైదరాబాద్‌లో వర్షం.. ఫాం హౌస్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ప్రకాష్ రాజ్

Share Icons:
హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన నగర ప్రజలకు కాస్త ఉపసమనం లభించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ఏర్పడినప్పటి నుంచీ తన ఫ్యామిలీతో హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లో ఉంటున్నారు. ఎంతో మంది వలస కూలీలకు తన ఫాం హౌస్‌లోనే ఆశ్రయం ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సాయంతో వలస కూలీలందరినీ వారి స్వస్థలాలకు పంపారు. ఇక అప్పటి నుంచీ తన భార్య పోనీ ప్రకాష్, కుమారుడు వేదాంత్‌తో ఫామ్ హౌస్‌లో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Also Read:

ఫాం హౌస్‌లో తమ సంతోష గడియలకు సంబంధించి ప్రకాష్ రాజ్ భార్య పోనీ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెడుతూనే ఉన్నారు. ఫాం హౌస్‌లోకి నెమళ్లు రావడం, తమ కుమారుడు వేదాంత్ మామిడి కాయల వ్యాన్ ఎక్కడం, తాను మట్టి ప్రమిదలు చేయడం, ఇలా చాలా ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఫాం హౌష్‌లో తన భర్తతో కలిసి కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తోన్న ఫొటోను పోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వర్షాకాలానికి స్వాగతం అని ఈ ఫొటోకు పోనీ క్యాప్షన్ పెట్టారు.

కాగా, పోనీ స్వతహాగా కొరియోగ్రాఫర్. ఆమెను ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ మొదట 1994లో తమిళ నటి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. ఈమె నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి సోదరి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. అయితే, 2009లో లలిత కుమారి నుంచి ప్రకాష్ రాజ్ విడిపోయారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ సంతానం. ప్రకాష్ రాజ్ తన సంపాదనలో కొంత మొత్తం చారిటీకి కేటాయిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసి అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు.