హీరో వరుణ్ సందేశ్ ఇంట్లో తీవ్ర విషాదం

Share Icons:
కరోనా కాటుతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కన్నుమూస్తుండటం యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తుతోంది. ఈ రోజు (నవంబర్ 10) యువ హీరో తాత, ప్ర‌ముఖ ర‌చ‌యిత (80) కరోనాతో కన్నుమూశారు. దీంతో వరుణ్ సందేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణవార్త తెలిసి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రచనల పట్ల ఉన్న ఆసక్తితో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకొని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారు జీడిగుంట‌ రామ‌చంద్ర‌మూర్తి. ఎక్కువగా రేడియో నాటకాలు రాసి అందులో నటించేవారు. కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచనలో ఆయన సిద్దహస్తులు. బుల్లితెరపై భారీ ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారు. అలాగే ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ అందించారు.

జీడిగుంట‌ రామ‌చంద్ర‌మూర్తికి ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అంటే వరుణ్ తేజ్ తండ్రితో సహా అమెరికాలోనే ఉంటారు. మూడో కొడుకు జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లతో నటిస్తుంటాడు.