హీరో పేరు వాడేస్తూ నయా మోసం.. పోలీసులను ఆశ్రయించిన శరత్ కుమార్

Share Icons:
పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనువుగా వాడుకుంటూ నయా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ వేదికలు ఉపయోగిస్తూ ఎదుటి వ్యక్తిని బురిడీ కొట్టించి లక్షలు, కోట్లలో సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. జనం వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ, సెలెబ్రిటీల పేర్లతో భారీ సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇటీవలే సింగర్ సునీత పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రాగా.. తాజాగా కోలీవుడ్ నటుడు పేరు వాడుతూ ఓ వ్యక్తి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

శ‌ర‌త్ కుమార్ ‘అఖిల భార‌త స‌మ‌త్తుల మక్కల్ క‌ట్చి’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం శరత్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన, స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ వ్య‌క్తి వివరాలు ఆరాదీసి అతనితో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరించారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని తెలిసి.. అనంతరం పోలీసులను ఆశ్రయించారు శరత్ కుమార్. ఈ మేరకు చెన్నై పోలీస్‌కమిషనర్‌‌కు తన ఫిర్యాదు అందించారు.

Also Read:
ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో సెల‌బ్రిటీల పేరు చెప్పి మోసం చేస్తున్న ఉదంతాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప్ర‌జ‌లు కూడా త‌మ వంతు బాధ్య‌త‌గా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉందని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని అంటున్నారు.