హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, ATV రైడ్స్ & మహారాజ తాలీస్ – వీటన్నిటి బట్టి మనకు అర్ధం అయ్యింది కదా, అర్జున్ కపూర్ తన 64MP #MegaMonster Samsung Galaxy M31 తో జైపూర్ వెళ్లాడని!

Share Icons:
మీరు సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతూ ఉంటే, మీరు అర్జున్ కపూర్ #MegaMonster ట్రయిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే ఉంటారు. ఒక రహస్యమైన ప్రదేశంలో అర్జున్ తన సమయాన్ని గడిపాడు అలానే తన సాహసాలను చూసి తానెక్కడికి వెళ్ళాడో మనం ఊహిస్తూ వస్తున్నాము. ఒక గొప్ప పర్యాటకుడిగా, అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో, సహజసిద్ధంగా ఏర్పడిన లోయ, నగరంలో సైకిల్ మీద తిరుగుతున్నట్టుగా, అందమైన సరస్సు ఒడ్డున లంచ్ చేస్తున్నట్టు… ఇలా ఈ రహస్య ప్రదేశంలో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. అర్జున్ ఇలా తన ప్రయాణపు ఫోటోలు తియ్యడంలో #MegaMonster Galaxy M31 లోని 64MP కెమెరా సహాయం ఉంది. అర్జున్ యొక్క సోషల్ మీడియాలో, తానెక్కడికి వెళ్ళాడో అని చాలా మంది కామెంట్స్ రూపం లో చెప్పారు, వీరిలో సరిగ్గా గెస్ చేసిన 5 లక్కీ విన్నర్స్ త్వరలో ఈ #MegaMonster Galaxy M31 ను పొందబోతున్నారు. మీకు తెలుసా- అర్జున్ #MegaMonster ట్రయిల్‌లో భాగంగా తానెక్కడికి వెళ్ళాడో ఈ శనివారం చెప్పేసాడు. తన తాజా పోస్టులో, అర్జున్‌ను సిటీ ఆఫ్ పాలస్ – జైపూర్‌లో ఒక హాట్-ఎయిర్ బెలూన్‌లో చూడొచ్చు.

దీని తరువాత ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టోరీలో అర్జున్ తన అభిమానులకు దీని గురించి చెప్పాడు.

మీకు ఒక విషయం తెలుసా, అర్జున్ తన జైపూర్ ప్రయాణంకు సంబంధించి మొదటి క్లూను ఫిబ్రవరి 20న పోస్ట్ చేసాడు. ఆ క్లూలో మనకు అర్జున్ ఒక ఎడారిలో ATVలో రైడ్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ క్లూను బట్టి తన ఫాలోవర్స్‌కు అర్జున్ రాజస్థాన్‌లో ఉన్నట్టు అర్ధం అయ్యింది, కానీ రాజస్థాన్‌లో ఎక్కడ అనే విషయం తెలియలేదు. అర్జున్ 64MP కెమెరా మరియు క్వాడ్ కెమెరా సెటప్‌తో కొన్ని అందమైన ఫోటోలు తీసి పోస్ట్ చేసాడు. అలానే అర్జున్ Galaxy M31 లో 6000mAh బ్యాటరీ ఉందనే విషయం కూడా చెప్పాడు.

నిజానికి, ఈ పింక్ సిటీలో అర్జున్ కపూర్ ప్రయాణానికి సంబంధించిన చాలా క్లూలను M31 ఉపయోగించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. వీటిని మీరు
చూడవచ్చు.

అర్జున్ యొక్క #MegaMonster ట్రయిల్‌కు సంబంధించిన మరొక క్లూ, మాన్ సాగర్ లేక్ వద్ద మహారాజా తాలి తినడానికి సిద్ధమైనట్టు తీసుకున్న ఫోటో పోస్ట్ చెయ్యడం ద్వారా ఇవ్వబడింది. ఆ పోస్టులో ఆహారం పసందుగా ఉన్నట్టు కనిపించడమే కాకుండా, వ్యూస్ కూడా విపరీతంగా వచ్చాయి. Samsung Galaxy M31 లోని మాక్రో మోడ్ సామర్థ్యం ఈ పోస్ట్‌తో తెలిసింది.

ఈ పోస్ట్ తరువాత, అర్జున్ ఫాలోవర్లకు తను ఉన్న లొకేషన్ గురించి కాస్త ఐడియా వచ్చింది, అయితే తను ఎక్కడికి వెళ్లాడనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. అర్జున్ అక్కడితో ఆగిపోలేదు- తను వెళ్లిన సిటీ గురించి మరింత చెప్తూ తన ఫాలోవర్లను ఊరిస్తూ వచ్చాడు.

అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన #MegaMonster ట్రయిల్‌ను చూసిన తరువాత, జైపూర్ యొక్క వివిద అందాలు గురించి మనకు తెలిసింది. అది సరస్సు ఒడ్డున తీసుకున్న మహారాజ తాలి కావచ్చు, ATV మీద చేసిన అడ్వెంచరస్ రైడ్ కావచ్చు లేదంటే జైపూర్ వీధులలో తిరుగుతున్నట్టు కావచ్చు. ఇవన్నీ చూసిన తరువాత మనకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే వీటన్నిటి ఫోటోలు తీసుకోవడానికి బ్యాటరీ పవర్ సరిపోయిందా? దీనికి సమాధానం, అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది వరకే Galaxy M31 గురించి పోస్ట్ చేసాడు, ఆ పోస్ట్‌లో మనకు తెలిసిందేమిటంటే ఈ డివైస్‌లో 6000mAh బ్యాటరీ ఉందని. ఈ బ్యాటరీ పవర్, 21 గంటల ఇంటర్‌నెట్ వినియోగాన్ని (వైఫై, స్టాండర్డ్), 48 గంటల టాక్ టైం/వాయిస్ కాల్ (LTE, స్టాండర్డ్), 26 గంటల వీడియో ప్లే టైం (స్టాండర్డ్) మరియు 119 గంటల వరకు మ్యూజిక్ ప్లే టైం (స్టాండర్డ్) ను అందిస్తుంది.

అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కండక్ట్ చేసిన పోల్ ద్వారా తన ప్రయాణానికి సంబంధించిన ఆఖరి క్లూను ఇచ్చాడు. పాలస్ యొక్క 64MP ఇమేజ్‌తో పాటు పువ్వు యొక్క మాక్రో ఫోటోను పోస్ట్ చేసి “మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏమిటి” అని అడిగాడు.

అర్జున్ కపూర్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ Galaxy M31లోని కెమెరా గురించి మనకు చాలా చెప్పింది. అయితే #MegaMonster తో తీసుకున్న ఈ అద్భుతమైన ఫోటోలను చూడడానికి మనకు హై-క్వాలిటీ స్క్రీన్ కావాలి. సరిగ్గా ఆ విషయంలోనే Samsung Galaxy M31 తానేంటో నిరూపించుకుంది. ఈ ఫోన్ FHD+ sAMOLED ఇన్ఫినిటీ U-డిస్‌‌ప్లేను కలిగి ఉంది. బెజెల్-లెస్ డిజైన్ కలిగిన డిస్‌ప్లే మరియు ఒక గొప్ప నాణ్యత కలిగిన ప్యానెల్‌తో ఇది సూపర్ బ్రౌసింగ్ అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

అర్జున్, ఈ Galaxy M31 తో చేసిన ఈ గొప్ప జర్నీను బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా అర్ధం అయ్యింది, అదేంటంటే మనకు కూడా మన విహారయాత్ర ఫోటోలు అర్జున్ ఫోటోలలానే గొప్పగా ఉండాలని. అలానే Samsung Galaxy M31 లోని 64MP కెమెరాకు ఆ సామర్ధ్యం ఉందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి, మీ సాహసాలను తెలియజేయడానికి మరియు ప్రతి విషయాన్నీ చాలా స్పష్టంగా ఫోటో తీయడానికి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎప్పుడు విడుదల అవుతుందనా! బాధపడొద్దు, అది ఎంతో దూరంలో లేదు. Samsung Galaxy M31 ఈ నెల 25న విడుదల అవుతోంది, మరియు మార్చ్ 5 నుండి
,
మరియు అన్ని ప్రధాన స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ధర ఎంత అనేది ఇంకా తెలియలేదు కదా, భయపడొద్దు ధర అందుబాటులోనే ఉంటుంది!

కాబట్టి మీ కలల విహారయాత్రకు బయలుదేరండి, మరియు #MegaMonster Galaxy M31 తో మీ అనుభవాలను పూర్తి వివరంగా ఫోటోలు తీసుకోండి.

డిస్‌క్లైమెర్: ఇది బ్రాండ్ పోస్ట్ మరియు టైమ్స్ ఇంటర్‌నెట్ స్పాట్‌లైట్ టీంచే వ్రాయబడింది.