సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌పై బీసీసీఐ క్లారిటీ

Share Icons:
వచ్చే ఆగ‌స్టులో సౌతాఫ్రికాలో భార‌త్ ప‌ర్య‌టిస్తుందంటూ క్రికెట్ ద‌క్షిణాఫ్రికా చేసిన వ్యాఖ్య‌ల‌ను తోసిపుచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ సిరీస్‌కు సంబంధించి ఎలాంటి క‌మిట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇంటర్నేష‌న‌ల్ ట్రావెల్‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌త వ‌చ్చేంత వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ సిరీస్‌ల‌పై తామేమీ మాట్లాడ‌బోమ‌ని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. నిజానికి ఫ్యూచ‌ర్ టూర్ ప్రొగ్రామ్ (ఎఫ్‌టీపీ)లోని శ్రీలంక‌, జింబాబ్వే ప‌ర్య‌ట‌నల‌పైనే తాము ఇప్ప‌టికి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, అలాంటిది సౌతాఫ్రికా సిరీస్‌ను ఎలా నిర్ధారిస్తామ‌ని ప్ర‌శ్నించారు.

Must Read:
మ‌రోవైపు గ‌త మార్చిలో సౌతాఫ్రికాతో జ‌ర‌గాల్సిన మూడు వ‌న్డేల సిరీస్ అర్ధాంత‌రంగా వాయిదా ప‌డింద‌ని, దీనిపై ఆ దేశంతో చ‌ర్చించామ‌ని ధుమాల్ తెలిపారు. ఇందుకు బ‌దులుగా సౌతాఫ్రికాలో మూడు టీ20ల సిరీస్ నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ‌కొచ్చింద‌ని, అయితే స్ప‌ష్ట‌తేమీ ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు జాతీయ క్రికెట్ అకాడ‌మీలో భార‌త క్రికెట‌ర్ల‌కు నేష‌న‌ల్ క్యాంపు నిర్వ‌హించ‌డంలో ఇబ్బంది ఉంటే, ప్రత్యామ్నాయంగా ధ‌ర్మ‌శాలలో నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Must Read:
ప్ర‌స్తుతానికి క‌రోనా వైర‌స్ ఉధృతి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అంత‌గా లేద‌ని, ఈ నేప‌థ్యంలో అత్యంత సుర‌క్షిత‌మైన ధ‌ర్మ‌శాల‌లోని స్టేడియంలో ఈ క్యాంపు నిర్వ‌హించుకోవ‌చ్చని ధుమాల్ తెలిపారు. ఇక ఐపీఎల్ కోసం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను వాయిదా వేయాల‌ని తాము సూచించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని ధుమాల్ స్ప‌ష్టం చేశారు.