సీనియర్ హీరోయిన్‌ కారు ప్రమాదం.. తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

Share Icons:
బాలీవుడ్‌ సీనియర్‌ నటి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ భారీ ట్రక్కును ఢీ కొట్టడంతో షబానా అజ్మీతో పాటు కారు డ్రైవర్, మరో గుర్తు తెలియని మహిళ గాయపడ్డారు. ఇదే కారులో షబానా అజ్మీ భర్త జావేద్‌ అక్తర్‌ కూడా ఉండగా.. ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది.

షబానా భర్త జావేద్‌ అక్తర్‌ 75వ జన్మదినాన్ని ముంబైలో జరుపుకుని ఇంటికి తిరుగు ప్రయాణం కాగా.. శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబైకి 60కి.మీ దూరంలోని ఖాలాపూర్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కాగా.. షబానా అజ్మీ, కారు డ్రైవర్‌లకు తీవ్రగాయాలు అయ్యారు. అయితే గుర్తు తెలియని మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.