సీక్వెల్‌కు ప్లాన్ వేసిన మాజీ ప్రియుడు.. రష్మిక ఒప్పుకుంటుందా?

Share Icons:
రష్మిక మందన.. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రష్మిక, రక్షిత్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోవారితో మాట్లాడి పెళ్లికి కూడా ఒప్పించారు. నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగిపోయింది. నిశ్చితార్థం అయిన కొద్దిరోజులకే తామిద్దరం విడిపోయామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇక తనకు సినిమా ఆఫర్లు రావనుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారట రష్మిక. కానీ ‘ఛలో’లో అవకాశం రావడంతో పెళ్లి వాయిదా వేసుకోవాలని అనుకున్నారట. అయితే పెళ్లి తర్వాత సినిమాలు వద్దని రక్షిత్ ఇంట్లోవారు చెప్పినట్లు టాక్. అందుకే రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సంగతి అటుంచితే.. ఇప్పుడు మరోసారి రష్మిక, రక్షిత్ కలిసి సినిమాలో నటించబోతున్నారట. ‘కిరాక్ పార్టీ’కి సీక్వెల్ తీయాలని రక్షిత్ శెట్టి అనుకుంటున్నారట. రక్షితే దర్శకుడు, నిర్మాత. వీరితో పాటు సంయుక్తా హెగ్డే, అరవింద్ అయ్యర్, ధనుంజయ్ రంజన్, ప్రమోద్ శెట్టి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్.

READ ALSO:

‘కిరిక్ పార్టీ’లో రష్మిక హీరోయిన్ కాబట్టి ఇప్పుడు సీక్వెల్‌లో కూడా ఆమే నటిస్తే బాగుంటుందని రక్షిత్ అనుకుంటున్నాడట. పాత విషయాలన్నీ మర్చిపోయి కేవలం ప్రొఫెషనల్‌ పరంగానే ఆలోచించి సినిమా చేస్తే బాగుంటుందని రక్షిత్ అభిప్రాయం. అసలే పెద్ద పెద్ద హీరోలతో రష్మిక తెలుగులో బిజీ అయిపోయింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరి రక్షిత్‌తో కలిసి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

READ ALSO: