సినిమా కోసం నీళ్లు తాగడం ఆపేసిన నాగశౌర్య.. ఎందుకంత రిస్క్!

Share Icons:
సినిమాలో పర్ఫెక్షన్ కోసం ప్రస్తుతం హీరోలు ఎంతకైనా తెగిస్తున్నారు. అస్సలు వెనకడుగు వేయడం లేదు. అవసరమైతే అమాంతం బరువు పెరుగుతున్నారు.. అంతే తేలిగ్గా తగ్గుతున్నారు. కానీ, దీని కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా ఈజీగా సిక్స్ ప్యాక్ చేసేస్తున్నారు. అయితే, యంగ్ హీరో తన తరవాత సినిమాలో ఎయిట్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు.

దేహ దారుఢ్యం పెంపొందించుకోవ‌డం అనేది డైట్‌, ఎక్సర్‌సైజ్‌, యాటిట్యూడ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. హీరో నాగ‌శౌర్య త‌న తాజా చిత్రం కోసం ఎయిట్ ప్యాక్ యాబ్స్ పొంద‌డానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో నాగ‌శౌర్య క‌చ్చిత‌మైన డైట్ ఫాలో అవుతూ రోజూ జిమ్‌లో చెమ‌టలు చిందిస్తున్నారు.

సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ స‌న్నివేశాల్లో నాగ‌శౌర్య ష‌ర్ట్ లేకుండా త‌న 8-ప్యాక్ బాడీని ప్రద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంది. ఫిట్ బాడీని అన్నివేళ‌లా మెయింటైన్ చెయ్యడం అంత సులువైన విష‌యం కాదు. గ‌త ఐదు రోజులుగా ఆయ‌న నీళ్లు తాగ‌డం ఆపేశారు. ఆఖ‌రుకి క‌నీసం లాలాజ‌లాన్ని కూడా మింగ‌డం లేదంటే ఫిట్‌నెస్ కోసం ఆయ‌న ఎంత‌గా శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవాల్సిందే.

ఇది న‌మ్మశ‌క్యంగా అనిపించ‌క‌పోవ‌చ్చు, కానీ ఇదే నిజం. సినిమాపై నాగ‌శౌర్యకు ఉన్న అంకిత‌భావం, త‌ప‌న‌కు ఇది నిద‌ర్శనం. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ ఫిల్మ్‌లో నాగ‌శౌర్య ఆర్చర్ (విలుకాడు)గా క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న నాయిక‌గా కేతికా శ‌ర్మ న‌టిస్తున్నారు. కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది నాగశౌర్యకు 20వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ ఎడిటర్. నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ నిర్మాతలు.

Also Read: