సినిమాల్లోకి రానున్న ఏఆర్ రెహమాన్ కూతురు రహీమా

Share Icons:
సుశంత్ మరణంతో బాలీవుడ్ నెపోటిజంపై తీవ్ర విమర్శలు వెత్తుతున్న వేల మరో సెలబ్రిటీ కూతురు ఇండస్ట్రీకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
రెహమాన్‌కి ముగ్గురు కుమార్తెలు ఉండగా, వారిలో రహిమ రెహమాన్ ఒకరు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో నెటిజన్స్‌కి కొంత సుపరిచితమే. అయితే తండ్రి వారసత్వంతో ఆమె సినిమాల్లోకి రావాలనుకుంటుంది. ఇప్పటికే రహీమా కొన్ని మ్యూజిక్ వీడియోలు చేసింది. ఇప్పుడు నటనలో శిక్షణ తీసుకునేందుకు రెడీగా ఉందట. వచ్చే ఏడాదిలో బాలీవుడ్ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెహీమా రెడీ అవుతున్నట్లు సమాచారం.

Read More:

ఇప్పటికే బాలీవుడ్‌లో పోటిజంపై భిన్న రకాల అభిప్రాయాలు, వాదనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెపోటిజం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం నెపోటిజం అన్నిచోట్ల పనిచేయదంటున్నారు. నట వారసత్వం అనేది కేవలం వెండితెరకి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంతే తప్ప, స్టార్‌గా ఎదగడానికి కాదు అంటూ కొందరు తమ వాదనలు వినిపించారు. అయితే మరికొందరు మాత్రం ప్రముఖుల పిల్లల సినిమాలు ఫ్లాప్ అవుతున్నా వారికే అవార్డులు.. కొత్త సినిమాల్లో ఆఫర్లు దక్కుతున్నాయని విమర్శిస్తున్నారు.