సినిమాల్లోకి ప్రభాస్ సోదరి… రాధేశ్యామ్ చిత్రంలో ఎంట్రీ

Share Icons:
టాలీవుడ్‌లో ఇప్పటికే హీరోల కుటుంబాల నుంచి అనేక మంది సిని రంగంలోకి ప్రవేశించారు. కొందరు నటులుగాను, కొందరు దర్శకనిర్మాతలగా మారారు. తాజాగా కృష్ణం రాజు కుటుంబం నుంచి మరొకరు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయబోతున్నారు. ఈ రాధేశ్యామ్‌ నిర్మాణంలో పాలుపంచుకుంటూ..ఈ సినిమాకు నిర్మాతగా ఆమె అడుగుపెట్టనున్నారు. రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్ తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. అంతేకాదు ప్రసీద పాపులర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించనుందట. అయితే ఈ విషయంలో ప్రభాస్ తన సోదరికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని సమాచారం.

సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా వచ్చిన ప్రభాస్ తన నటనతో అభిమానుల్ని సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి, బాహుబలి వంటి సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాహుబలి, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో లాంటీ సినిమాలతో జాతీయ స్థాయిలోసైతం ప్రభాస్ పాపులర్ అయ్యాడు. ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ అనే ఓ పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరి చేస్తున్నాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. UV బ్యానర్‌తో కలిసి గోపికృష్ణ బ్యానర్‌పై కృష్ణం రాజునిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై .. ట్రెండ్ సెట్ చేసింది. యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.