సింధు ఓటమి.. ముగిసిన భారత పోరాటం

Share Icons:
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత ప్లేయర్ కూడా గురువారం ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు .. జపాన్ ప్లేయర్ సయాకా తకహషి చేతిలో ఓడిపోయింది. మరో భారత ప్లేయర్ సైనా నెహ్వాల్‌ను తొలి రౌండ్‌లో ఓడించింది కూడా తకహషియే కావడం విశేషం.

Read Also :
మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో సింధు 21-16, 16-21, 19-21తో తకహషి చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీ తొలిరౌండ్‌లో ఆయా ఒహోరి (జపాన్)పై విజయం సాధించి జోరు కనబర్చిన సింధు.. రెండో రౌండ్‌లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. తొలి గేమ్‌ను నెగ్గి దూకుడు కనబర్చిన భారత ప్లేయర్.. తర్వాతి రెండు రౌండ్లలో అనవసర తప్పిదాలు చేసి పరాజయం పాలైంది.

Read Also :
టోర్నీ తొలిరౌండ్‌లోనే భారత ప్లేయర్లు , కిడాంబి శ్రీకాంత్, బీ సాయిప్రణీత్, సౌరభ్ వర్మ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సింధు తాజా పరాజయంతో టోర్నీలో భారత పోరు ముగిసినట్లయ్యింది.

Read Also :