సాహిత్యం – ఒక విశ్లేషణ.

సాహిత్యం – ఒక  విశ్లేషణ.
Views:
45

తీగకి పందిరి కావలె కాని…..

తెలుసా నువ్వే పందిరనీ…

పని చేసుకొంటూ పాటలు వినడం నాకు బాగా అలవాటు. అలాగే పని చేసుకొంటూ ఉన్నప్పుడు నాలో ఆలోచనలు కూడా సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఈరోజు విన్న ఈ పాట గురించి నాలో ఆలోచనలు అలా సాగిపోయాయి. తీగకి పందిరి కావలె కాని , తెలుసా నువ్వే పందిరని అంటే ఈ విషయం తీగకి తెలుసా అని అడుగుతున్నార? లేక పందిరికి నువ్వే తీగకి పందిరి అని నీకు తెలుసా ? అని చెప్తున్నారా? ఈ రెంటిలో ఏది చెప్పీనా అటు తీగకి కాని ఇటు పందిరికి కాని తెలుస్తుందా? తెలియజేయగలమా? ఇది స్త్రీ పురుషుల సహజీవనానికి ఒక ఉపమానలంకారము కదా. సినీ పాటల రచనల కల్పన. ఇలా ఆలోచిస్తూ పని చేసుకొంటున్న నాకు, అప్పటికి దాక పాటలకి సంబంధించ ఛానెల్ మార్చేసినట్లున్నారు మా ఇంట్లో వాళ్ళు , ఏదో గోల, గోలగా వినిపిస్తోంది.

మంచి పాటని విననీయకుండా చేసారని కోపంగా ఇవతలకి వచ్చి చూస్తే మా వాళ్ళు పెట్టింది అదేదో వార్తా ఛానెల్. మానవత్వం మర్చిపోయి, మగ ఆడ తేడా లేకుండా ఒక 23 ఏళ్ళ యువతిని గొడ్డుని బాధినట్లు బాదేస్తున్నారు. చూడడానికి కాస్త చదువుకొన్న అమ్మాయిలా ఉంది ఆ దెబ్బలు తింటున్న యువతి. ఎక్కడ కొడ్తున్నారో తెలియకుండా పైశాచికత్వం చూపిస్తున్నారు. కాల్తో తొక్కి మరి హింసిస్తున్నవారేవరో కాదు తోటి మహిళలు. అంత నేరం ఏమి చేసిందో పాపం అని చూసిన వారికెవరికైనా మనసు చలించక మానదు. నాకయితే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఆమెని అలా కొడ్తుంటే. పైగా బ్యాక్ గ్రౌండ్లో పాట, “మంచిని సమాధి చేస్తారా… ఇది మనుషులు చేసే పనియేనా??….ఏ తప్పు చేయని వాడు ముందుగా రాయి విసరాలి ……” అంటూ…..అందులో ఇలాంటి విశేషాలు ఏమన్నా ఉంటే మన మీడియా పండగ చేసుకుంటుంది అనడానికి ఇదో పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. చూపించిందే చూపించి, ఎలా కొడ్తున్నారో వెనక ఒక పాటతో .. అవతలి వాళ్ళకి కనుల విందు (నిజమేనా??) చేసేస్తారు.అసలింతకీ

ఎందుకు కొడ్తున్నారని వివరాల్లోకి వెళ్తే…

ఏదో నవలలికి ప్రభావితమై… ఓ ప్రజా ప్రతినిధికి, ఈ యువతికి వివాహేతర సంబంధం.. పాపం బయటపడ్డారు, మరి ఆ ప్రజాప్రతినిధి ఏమి చేస్తున్నాడు? అంటే వీలయినంతవరకు సర్ధి చెప్పడానికి ప్రయత్నించి అతనూ ప్రేక్షకుడయ్యాడన్నది సత్యం. అతనినెవరు కొట్టడంలెదేంటి, తప్పు అతనిది కూడా ఉంది కదా లాంటి ప్రశ్నలకి సమాధానాలు మనకి రావు..రాకూడదూ.. రాలేవు …రాబోవు. మరి అంతకు ముందే నేను విన్న పాట తీగకి పందిరి….. ఆ పందిరి తనె అని ఈ పెద్దమనిషికి తెలీదా? … హా.. హా హాస్యాస్పదంగా ఉంది కదా… ఇక ఆ కొట్టేవాళ్ళు అటు ప్రజా ప్రతినిధికి సంబంధించినవాళ్ళు కాదు, ఇటు ఈ యువతికి సంబంధించినవాళ్ళు కాదు, సామాన్య ప్రజానీకం. మరి వాళ్ళకెందుకింత ఆవేశం? ఎందుకీ అనవసర జంజాటం? ఎవరికీ తెలీదు ఏమి జరిగింది అనేది.

సరే ఇది చూసిన నాకు చప్పున స్ఫురించిన విషయం ఈ మధ్యే ఏదో బ్లాగులో చదివిన ఒక నాలుగు లైన్లు.. ఎందుకో అర్థం లేని పుస్తకాలు చదివి, సినిమాలు చూసి,  కనిపించిన వారిని హీరోలుగా భావించి, అభాసుపాలవుతున్న నేటి యువతకి ఈ విశ్లేషణ పనికొస్తుందేమో అనిపించి వ్రాస్తున్నాను.

*********

ప్రపంచంలోనూటికి తొంభైతొమ్మిది మంది సాహిత్యంలో పాత్రల్లా ఉండరు. దాన్నే తిప్పి చెబితే, సాహిత్యంలో పాత్రలు ప్రపంచంలోని నూటికి తొంభైతొమ్మిది మందిలాగా ఉండవు.”

 కదా.. అసలలా ఉండకూడదు కూడా. సాహిత్యమంటేనే కొంత నిజం, కొంత కల్పితం. సాధారణంగా తన పరిసరాల్లోనో తను విన్న వాటినో కొంచం కల్పితం, కొంచం నిజంతో సృహ్టించబడే పాత్రలే ఈ సాహిత్యానికి వెన్నుపూసలాంటివి. విభిన్న మనస్థత్వాలని, విభిన్న గుణాలని ప్రోది చేసుకొని అవన్ని ఒక్కరిలో చూపించి పాత్రలుగా మరల్చుకొని మంచి సాహిత్యాన్ని అందజేయడానికి పాటుపడ్తారు సాహిత్యకారులు. అంతేకాని నిజానికి అన్ని లక్షణాలు ఒకేవ్యక్తిలో మనము చూడలేము. అసాధాణం , ఎక్కడా వినలేదు, చక్కటి విశాల భావాలు….. అని పాటిద్దామని చూస్తే ఇదిగో పైన చెప్పన సంఘటనలానే ఉంటాయి పర్యవసానాలు.

రంగనాయకమ్మగారి స్వీట్ హోం బుచ్చిబాబుని , ఆయన లక్షణాలని అన్ని ఒకే వ్యక్తిలో చూడలేకపోయినా, బయట కొంతమందిలో కొన్ని కొన్ని చూస్తాము, అలాగే విమల వ్యక్తిత్వాన్ని వ్రాసినట్లే చూడలేకపోయినా అంతో కొంతో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు , ఇలాంటి “స్వీట్ హోం ” అనేది ఎక్కడో అక్కడ మనకి తారసపడ్తుంది.. ఇలాంటి అనుసరణనీయమే ఉంటుంది కాని అసాధారణం అన్నది కనపడదు. ఇలాంటి లక్షణాలు ఉన్న పాత్రలు బయట కనపడినా మనకి నష్టం లేదు, పైపెచ్చు సంతోషమే కాని.

ఇంకా గట్టిగా చెబితే ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరైన అసాధారుణుల్నిగురించే సాహిత్యం పట్టించుకునేదీ, పాత్రలుగా నిలబెట్టేదీనూ.”

 వికార పాత్రలు సృష్టిస్తే వచ్చేవే ఈ అసాధారణం, సాహిత్యం పట్టించుకోడం లాంటి ఆలోచనలు. అసాధారుణుల్ని, పాత్రలని కాదు, పాత్రల వ్యక్తిత్వాన్ని నిలిపేదిగా, నిలబెట్టేదిగా సాహిత్యం ఉండాలన్నది నా అభిప్రాయం. చదివినవాళ్ళు స్ఫూర్తి చెందాలి కాని, ఇంత వైపరిత్యమా అని అనుకోకుండా ఉండాలన్నది నా ఆలోచన.

“కోటిలో మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది మంది ఉన్నట్టే సాహిత్యంలోపాత్రా ఉంటే, ఇహ చెప్పేదేవుందీ?”

చదివి మనమలా ఎందుకుండకూడదు అనుకొంటూ… మనమంతా అసాధారణం అనుకొనో, చాల ప్రత్యేకమనో , మన దారే వేరు అని స్ఫూర్తి చెంది పాటిస్తే ….. జరిగినది చెప్పడం జరిగిందిగా…..మనం అసాధారుణులం, మనకి మనమే సాటి అనుకొన్న ఈ అసాధారుణుల పైత్యానికి , సాధారణ ప్రజానిక పైశాచికం.. కాబట్టి ఉండనవసరం కూడా లేదనుకొంట కదా. అలా కల్పించి రాసేవి, ఆ సాహస కృత్యాలు సాహిత్యానికే పరిమితం చేసుకొంటే మంచిది.

మంచి రచనలు మన ఆలోచనలని మంచి మార్గంలో పయనింపజేసేవి, సాహిత్యం ద్వారా మనల్ని మనం తెలియజేసుకొనేవి, లౌక్యం తెలియజేసేవి మనలోని జ్ఞానాన్ని పెంపొందింపజేసేవి, మనకి రాచమార్గం చూపేవి అయితే, ఇలాంటివి చదివి, స్ఫూర్తి చెంది, కోటిలో మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది మంది ఉన్నట్టే సాహిత్యంలోపాత్రా ఉన్నా….. మనకు వచ్చే నష్టం కూడా ఏమి లేదు. సాహిత్యానికి, ఆ సాహిత్యం అందజేసిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ .. శిరస్సు వంచి నమస్కరించవచ్చు…ఏమంటారు?

-సాహితీ రత్న

(Visited 24 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: