సడక్2 ట్రైలర్ విడుదల.. కీలకపాత్రలో సంజయ్ దత్

Share Icons:
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో సడక్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తుననారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్‌ భట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సడక్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది. 1991లో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్‌. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక కథ విషయానికి వస్తే… మరోసారి రవివర్మ పాత్రలో నటిస్తున్న సంజయ్‌ తన భార్య(పూజా భట్‌) చనిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్‌ వృత్తిని మానేసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెడుతన్న నకిలీ బాబా గుట్టును బయటపెట్టడానికి ఆలియా ప్రయత్నిస్తుంటుంది. సంజయ్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌ల సహకారంతో నకిలీ బాబా గుట్టును ఆమె ఎలా బహిర్గతం చేస్తుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

Read More:

నకిలీ బాబా పాత్రలో మకర్‌ దేశ్‌ పాండే, గుల్షన్‌ గ్రోవర్, జిష్ణు సేన్‌ గుప్తా తదితరులు‌ నటిస్తున్నారు. విశేష్‌ ఫిలింస్‌ బ్యానర్‌ పేరు మీద ముఖేశ్‌ భట్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్‌ భట్‌ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.తండ్రి మహేష్‌ భట్‌ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. కరోనా నేపథ్యంలో సడక్ 2 సినిమానుఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది.

మరోవైపు సినిమా విడుదలవుతున్న శుభసందర్భంగా సంజయ్‌ దత్‌ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సంజయ్ దత్‌కు నానావతి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ప్రస్తుతం థర్డ్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో సంజయ్‌ చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నారు.