సచిన్, గంగూలీ కంటే వేగంగా రోహిత్ శర్మ

Share Icons:
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడోవన్డేలో భారత క్రికెటర్ అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డేల్లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో ఫాస్టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. 217వ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ మైలురాయిని దాటగా.. అందరికంటే వేగంగా ఈ మార్కును చేరిన కోహ్లీ (194 ఇన్నింగ్స్‌) ఈ క్లబ్‌లో ముందు వరుసలో నిలిచాడు. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కమిన్స్ బౌలింగ్‌లో రెండు పరుగులు సాధించిన హిట్‌మ్యాన్.. ఈమైలురాయిని దాటాడు.

Read Also :
ఇక రెండోస్థానంలో సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ నిలిచాడు. తను 208 ఇన్నింగ్స్‌ల్లో 9వేల పరుగుల మైలురాయిని దాటడం విశేషం. మరోవైపు రోహిత్ తర్వాత స్థానంలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ నిలిచారు. ఈ ఘనత సాధించేందుకు గంగూలీకి 228 ఇన్నింగ్స్‌ అవసరమవగా.. సచిన్ తన 235వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని దాటాడు.

Read Also :
ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరిగుతున్న మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ కట్టడి చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131) సెంచరీతో అదరగొట్టాడు. మార్నస్ లబుషేన్ (54) రాణించాడు. బౌలర్లలో మహ్మద్ షమీ (4/63), రవీంద్ర జడేజా (2/44) రాణించారు.

Read Also :